హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని జనగామలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డీజీపీ అనురాగ్ శర్మకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో అనురాగశర్మను పొన్నాల కలిశారు.
జనగామ ప్రత్యేక జిల్లా కోసం పోరాడుతున్న వారిపై కేసులు ఉపసంహరించాలని ఈ సందర్భంగా అనురాగశర్మను పొన్నాల కోరారు. పొన్నాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అనురాగశర్మను కలిసినవారిలో ఉన్నారు.