- అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి
- పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
- కోర్టు నుంచి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ
ప్రజల ఒత్తిడితోనే జనగామ జిల్లా ఏర్పాటు
Published Thu, Oct 6 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
జనగామ : ప్రజాస్వామ్య దేశంలో ఒత్తిడి ఓ ఆయుధమని, ప్రజలు పాలకులపై తిరగబడితే తప్ప పనులు కావని జనగామ జిల్లా ఏర్పాటుతో తేలిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాతీయ రహదారులను దిగ్బంధించిన ఘటనలో పొన్నాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగం గా బుధవారం పొన్నాల లక్ష్మయ్య జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల ప్రకటనతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాబూజగ్జీవ¯ŒSరామ్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా..పాలకుర్తి సోమన్న, జీడికల్ సీతారాములు, కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధేశ్వరుడు, బెక్కల్ రామలింగేశ్వరస్వామి కరుణతో జనగామ జిల్లా ఏర్పడిందన్నారు. జనగామ జిల్లా కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలక భూమిక పోషించిందన్నారు.
ఐదు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో ఇక్కడి ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించామని పేర్కొన్నా రు. గత ఐదు నెలల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా స్పందిం చడంలేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇతంటి దారుణ పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. పట్టణంలో 85 రోజుల పాటు 144 సెక్ష¯ŒS అమ లు చేసి సాగించిన నిర్భంధకాండను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు మద్దూరు, నర్మెట, చేర్యాల రిజర్వాయర్లను నిర్మిస్తే వాటిని సిద్దిపేటకు తరలించ డం బాధాకరమన్నారు. జిల్లాల పేరుతో జనగామను మూడు ముక్కలు చేస్తున్నారని మం డిపడ్డారు. జిల్లాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరె డ్డి, మున్సిపల్ మాజీ చైర్మ¯ŒS వెన్నెం వెంకటనర్సింమారెడ్డి, నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, అన్వర్, చిర్ర సత్యనారాయణరెడ్డి, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సు« దాకర్, బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్‌రెడ్డి, రాందయాకర్, మదార్ షరీఫ్, జమా ల్ షరీఫ్, రంగ రాజు ప్రవీణ్, మేకల రాంప్రసాద్, పన్నీరు రాధిక, వెన్నం శ్రీలత, వంగాళ కళ్యాణి మల్లారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జెడ్పీటీసీ నాచగోని పద్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement