victory rally
-
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్‌హౌస్‌లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్‌లోని ప్రెసిడెంట్ రూమ్‌లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్‌హౌస్ దాకా ట్రంప్ పరేడ్‌గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్‌ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్‌ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్‌కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరిచారు. -
ప్రజల ఒత్తిడితోనే జనగామ జిల్లా ఏర్పాటు
అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోర్టు నుంచి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ జనగామ : ప్రజాస్వామ్య దేశంలో ఒత్తిడి ఓ ఆయుధమని, ప్రజలు పాలకులపై తిరగబడితే తప్ప పనులు కావని జనగామ జిల్లా ఏర్పాటుతో తేలిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాతీయ రహదారులను దిగ్బంధించిన ఘటనలో పొన్నాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగం గా బుధవారం పొన్నాల లక్ష్మయ్య జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల ప్రకటనతో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాబూజగ్జీవ¯ŒSరామ్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా..పాలకుర్తి సోమన్న, జీడికల్ సీతారాములు, కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధేశ్వరుడు, బెక్కల్ రామలింగేశ్వరస్వామి కరుణతో జనగామ జిల్లా ఏర్పడిందన్నారు. జనగామ జిల్లా కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఐదు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో ఇక్కడి ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించామని పేర్కొన్నా రు. గత ఐదు నెలల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా స్పందిం చడంలేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇతంటి దారుణ పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. పట్టణంలో 85 రోజుల పాటు 144 సెక్ష¯ŒS అమ లు చేసి సాగించిన నిర్భంధకాండను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు మద్దూరు, నర్మెట, చేర్యాల రిజర్వాయర్లను నిర్మిస్తే వాటిని సిద్దిపేటకు తరలించ డం బాధాకరమన్నారు. జిల్లాల పేరుతో జనగామను మూడు ముక్కలు చేస్తున్నారని మం డిపడ్డారు. జిల్లాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరె డ్డి, మున్సిపల్ మాజీ చైర్మ¯ŒS వెన్నెం వెంకటనర్సింమారెడ్డి, నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, అన్వర్, చిర్ర సత్యనారాయణరెడ్డి, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సు« దాకర్, బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్‌రెడ్డి, రాందయాకర్, మదార్ షరీఫ్, జమా ల్ షరీఫ్, రంగ రాజు ప్రవీణ్, మేకల రాంప్రసాద్, పన్నీరు రాధిక, వెన్నం శ్రీలత, వంగాళ కళ్యాణి మల్లారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జెడ్పీటీసీ నాచగోని పద్మ తదితరులు పాల్గొన్నారు. -
విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడు
కన్నూర్: కేరళలో సీపీఎం నాయకుడు పినరయి విజయన్ ర్యాలీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. ఎల్డీఎఫ్ విజయాన్ని పురస్కరించుకుని కన్నూరు జిల్లాలోని పినరయిలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు బాంబు విసిరినట్టు తెలుస్తోంది. బాంబు పేలుడుతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఆర్ఎస్ఎస్ శక్తుల పనేనని ఎల్డీఎఫ్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేసులో ముందున్న విజయన్ పాల్గొన్న ర్యాలీలో బాంబు పేలుడు జరగడంతో కలకలం రేగింది. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార యూడీఎఫ్ కూటమి ఓడిపోగా, ఎల్డీఎఫ్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. కాగా, సీఎం అభ్యర్థి పేరును రేపు ఖరారు చేస్తామని సీపీఎం నేడు ప్రకటించింది.