![Chanchal Sharma Drives An E Rickshaw With Her One Year Old Son - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/25/woman.jpg.webp?itok=QzZnSxIN)
భర్త నిరాధరణకు గురైతే ఆ స్త్రీ పరిస్థితి వర్ణానాతీతం. అందులోనూ పిల్లల తల్లి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడొక ఒక మహిళ కూడా అలానే ఏడాది చిన్నారితో జీవన పోరాటం సాగిస్తోంది.
వివరాల్లోకెళ్తే...చంచల్ శర్మ అనే మహిళ ఏడాది వయసు ఉన్న కొడుకుని నడుంకి కట్టుకుని మరీ ఈ రిక్షాని నడుపుతోంది. ఐతే ఒక మహిళ ఇలా డ్రైవింగ్ చేయడాన్ని స్థానిక ఈ రిక్షా డ్రైవర్లు నిరాకరించారు. అంతేగాదు ఆమె నోయిడాలోని ఒక నిర్ధిష్ట రహదారిలో డ్రైవ్ చేసేందుకు కూడా ససేమిరా అంటూ గొడవ చేశారు. ఐతే ఆమె ట్రాఫిక్ పోలీసులు, ఏ1బీ అవుట్ పోస్ట్ సిబ్బంది మద్దతుతో సమస్యలను అధిగమించింది.
సదరు మహిళ భర్త ఆమెను వేధింపులకు గరిచేయడంతో అతన్ని వదిలేసి వచ్చి తన కాళ్లపై తాను గౌరవప్రదంగా జీవించేందుకు తాపత్రయ పడుతోంది. ఆ క్రమంలోనే ఆమె ఈ రిక్షా డ్రైవర్‌గా జీవనోపాధిని ఎంచుకుంది. లాల్ కువాన్‌కి చెందిన చంచల్ శర్మ కొన్ని రోజులు తన తల్లి లేదా చెల్లితో కలిసి ఉంటానని వెల్లడించింది.
ఈ మేరకు చంచల్ శర్మ మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం 2019లో దాద్రీలోని ఛయాన్సా గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి చిత్రహింసలకు గురి చేసి వేధించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు తెలిపింది. తన భర్త పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. కోర్టులో కేసు నడుస్తోందని కూడా చెప్పింది. తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడని, తనకు నలుగు చెల్లెళ్లు ఉన్నారని చెప్పింది. ఆమె తల్లి కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటుందని తెలిపింది.
(చదవండి: నాకు 30 ఆమెకు 12 అంటూ... షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment