ఈ-రిక్షాలతో ఇబ్బందులు
Published Sat, Oct 19 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
న్యూఢిల్లీ: పర్యావరణ సంరక్షణ మాటేమో గానీ ఎలక్ట్రానిక్ రిక్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. ఇవి తమ పరిధిలోకి రావు కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోతున్నారు. ఈ-రిక్షాలు 250 వాట్ల మోటార్లతో నడుస్తున్నందున ఇవి ఢిల్లీ మోటారు వాహనాల చట్టం పరిధిలోకి రాబోవు. నిజానికి చాలా ఈ-రిక్షాలకు 250 కంటే అధిక వాట్ల మోటా ర్లు బిగించారు. ప్రభుత్వం మాత్రం 250 వాట్లకు పైబడిన ఈ-రిక్షాలను నిషేధించింది. ఇవి మెల్లిగా ప్రయాణించడం వల్ల రోడ్డుపై మరింత రద్దీ కనిపిస్తోంది. ఈ వాహనాలు నిబంధనలను ఉల్లంఘించి ప్రధాన రహదారిపైనే సంచరిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే వాదనలు ఉన్నా యి.
ఇవి ఏయే ప్రాంతంలో తిరగాలి..ఎన్ని ఉండాలనే దానికి తగిన నిబంధనలు రూపొందించినప్పుడే ఈ-రిక్షాలను నియంత్రించడం సాధ్యపడుతుందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పహార్‌గంజ్, ఆర్కే ఆశ్రమ్‌మార్గ్, పార్లమెంటువీధి, ఉత్తమ్‌నగర్, కైలాష్‌కాలనీ, ఢిల్లీ యూనివర్సిటీ మార్గాల్లో ఈ-రిక్షాలు ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగా న్ని మించడం లేదని, చాలా రిక్షాలకు 250 కంటే అధిక వాట్ల మోటార్లు బిగించారని ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ శుక్లా అన్నారు. వీటిని కూడా ప్రజారవాణా వాహనాలుగా గుర్తించి ఆపరేటర్లకు లెసైన్సులు ఇవ్వాలని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అధిక సామర్థ్యం కలిగి న మోటారును బిగించుకున్నా ఫర్వాలేదు కానీ, అన్ని ఈ-రిక్షాలకు రవాణాశాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయితే నిబంధనల ప్రకా రం డ్రైవర్లు వీటిని సరిగ్గా పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది డ్రైవర్లు పార్కింగ్ నియమాలను పట్టించుకోవడం లేదు.
నిబంధనలకు విరుద్ధమే అయినా అధిక సామర్థ్యం గల మోటార్లు వినియోగించడం సర్వసాధారణమేనని డ్రైవర్లు అంటున్నారు. ఐదుగురు ప్రయాణికులను ఎక్కించుకునేవాళ్లు దాదాపు 650 వాట్ల మోటార్లను బిగించుకుంటున్నారు. ఇప్పుడు అంతా దాదాపు 850 హెచ్‌పీ సామర్థ్యం గల చైనా తయారీ ఇంజన్లు వాడుతున్నారని, తక్కువస్థాయి సామర్థ్యమున్న ఇంజన్లు అసలు దొరకడమే లేదని డీలర్లు అంటున్నారు. రోజువారీ సంపాదన ఎలా ఉంటుం దన్న ప్రశ్నకు ఓ డ్రైవర్ స్పందిస్తూ తాను రూ.700 సంపాదిస్తానని, ఇందులో రిక్షా యజమానికి రూ.400 వరకు చెల్లిస్తానని చెప్పాడు. దీని నిర్వహ ణ వ్యయం తక్కువగా ఉంటుంది. ఒకరాత్రి మొత్తం రీచార్జి చేస్తే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని డీలర్లు చెబుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నాయంటూ ఈ-రిక్షాలను గతంలోనే స్థానిక కోర్టు ఒకటి నిషేధించింది. ఈ నిర్ణయాన్ని డ్రైవర్లు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దాని ఆదేశాల మేరకు వీటి నిర్మాణాత్మక పటిష్టతపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
Advertisement
Advertisement