ఈ -రిక్షాల అంశంపై పార్టీ నేతలతో గడ్కారీ భేటీ | Delhi BJP delegation meets Gadkari on e-rickshaw issue | Sakshi
Sakshi News home page

ఈ -రిక్షాల అంశంపై పార్టీ నేతలతో గడ్కారీ భేటీ

Published Tue, Sep 16 2014 4:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Delhi BJP delegation meets Gadkari on e-rickshaw issue

న్యూఢిల్లీ: పదిరోజుల్లో ఈ రిక్షాలను రోడ్లపైకి తెస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో ఢిల్లీ బీజేపీ నేతలు మంగళవారం సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ నేతలతో ఈ రిక్షాలపై అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ రిక్షాలపై నిషేధంతో వేలాదిమంది జీవనాన్నికోల్పోయారని సమావేశం అనంతరం ఢిల్లీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం ఆ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసిన సందర్భంగా నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా, జాతీయ రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ గత జూలై 31వ తేదీన ఈ రిక్షాలు రోడ్లపై సంచరించడాన్ని హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. రోడ్లపై ఈ రిక్షాల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తయారు చేయడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై అంశంపై ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటనను చెప్పిన సమయానికి అమలు చేయకపోతే ఆందోళన చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement