కేజ్రీవాల్‌కు సమన్లు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీఅయ్యాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన.. దేశంలో అత్యంత అనివీతిపరుల జాబితాలో తన పేరు చేర్చి తన ప్రతిష్టను దిగజార్చారని ఆరోపిస్తూ నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టిన మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా ఏప్రిల్ 7న పటియాలా కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు.
తమ క్లయింటు ప్రతిష్టను దిగజార్చాలన్న దురుద్దేశంతోనే కేజ్రీవాల్ ఆయనను జాబితా ఒకరిగా పేర్కొన్నారని బీజేపీ నేత నితిన్ గడ్కరీ తరపున వాదించిన న్యాయవాదులు పింకీ ఆనంద్, అజ య్ దిగ్పాల్ పేర్కొన్నారు. నితిన్ గడ్కరీపై కేజ్రీవాల్ నిరాధారమైన అసత్య ఆరోపణలు చేశారని వారు తెలిపారు. నితిన్ గడ్కరీ, న్యాయవాది నీరజ్ ఫిబ్రవరి 18న న్యాయస్థానం ఎదుట కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. అవి నీతికి వ్యతిరేకంగా తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటిస్తూ అరవింద్ కేజ్రీవాల్ జనవరి 31న అత్యంత అవినీతిపరులైన నేతల జాబితాను విడుదల చేశారని, అందులో తన పేరు కూడా ఉందని గడ్కరీ న్యాయస్థానానికి తెలిపారు. తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడం కోసమే కేజ్రీవాల్ తన పేరు చేర్చారని గడ్కరీ ఆరోపించారు.
ఎలాంటి ఆధారం లేకుండా ప్రతిష్టను దిగజార్చే అసత్య ఆరోపణలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటేనని గడ్కరీ పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలు ప్రజల ఎదుట తన ప్రతిష్టను దెబ్బతీశాయని ఆయన ఆరోపిం చారు. కేజ్రీవాల్, అతని పార్టీ సభ్యులకు తనపై చేసిన ఆరోపణలు అబద్ధమని తెలిసినప్పటికీ కేవలం తన ప్రతిష్టను దిగజార్చాలన్న దురుద్దేశంతోను తనను అవినీతిపరుల జాబితాలో చేర్చినట్లు గడ్కరీ కోర్టుకు తెలిపారు.