'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు' | No decision on CM candidate for Delhi: BJP | Sakshi
Sakshi News home page

'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు'

Published Wed, Oct 16 2013 5:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు' - Sakshi

'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు'

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది అని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వెల్లడించారు. 
 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్ష వర్ధన్ ను ప్రకటించారనే వార్తలు మీడియాలో వస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రకటన చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు గడ్కారీ జవాబిచ్చారు. త్వరలోనే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన తెలిపారు. 
 
క్లీన్ ఇమేజ్ ఉన్న నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో హర్ష వర్ధన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రిగా హర్ష వర్ధన్ సేవలందించారు. కాంగ్రెస్ తరపున ప్రస్తుత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రివాల్ పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement