'దేశవ్యాప్త చర్చకు, ఇక్కడి పరిస్థితులకు పొంతలేదు' | amitab kundu, ramachandraiah expressed their views on capital amaravati | Sakshi
Sakshi News home page

'దేశవ్యాప్త చర్చకు, ఇక్కడి పరిస్థితులకు పొంతలేదు'

Published Sun, Apr 17 2016 2:47 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

amitab kundu, ramachandraiah expressed their views on capital amaravati

విజయవాడ: అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం లేకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం సరి కాదని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిటైర్ ప్రొఫెసర్ అమితాబ్ కుందు, జేఎన్ యూ  సీనియర్ ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్యలు అభిప్రాయ పడ్డారు.  రైతుల కోరిక మేరకు రాజధాని గ్రామాలలో వీరు పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తమ పర్యటన వివరాలను పంచుకున్నారు.

సామాజికంగా, భౌగోళికంగా అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం చేయకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమరావతి పై జరుగుతున్న చర్చ కు, ఇక్కడి పరిస్థితులకు మద్య పొంతన లేదని అన్నారు.  పర్యావరణంకు జరుగుతున్న నష్టం పై ఎన్ జి టి లో విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీలు వేయటం అర్ధరహిత మని అన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం సరి కాదన్నారు.  భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల న్యాయ పరమైన చిక్కులే కాక పర్యావరణ ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement