‘లోకేష్‌ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’ | YSRCP Leader C Ramachandraiah Critics Chandrababu Protest On AP Capital | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’

Published Wed, Feb 5 2020 4:04 PM | Last Updated on Wed, Feb 5 2020 8:19 PM

YSRCP Leader C Ramachandraiah Critics Chandrababu Protest On AP Capital - Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్‌ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
(చదవండి : చంద్రబాబుది పోరాటం కాదు..ఆస్తుల కోసం ఆందోళన)

‘రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ఆదుకుంటారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రైతులకు సీఎం రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఒకటి అభివృద్ధి చేయడం. రెండు వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడు. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడు. నీ పాలనలో ఒకసారైనా రిఫరెండం పెట్టావా చంద్రబాబు. అయినా, లోకేష్ ఓడిపోయాక రిఫరెండం ఎందుకు..? బాబుకు అవసరమైనప్పుడల్లా రిఫరెండం పెట్టాలా. ఆయన మాటలు విని రైతులు మోసపోవద్దు. ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలి.

హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తి వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయని తుగ్లక్ చంద్రబాబు. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ ఆయన. మా విధానమే పరిపాలన వికేంద్రీకరణ. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదు. ఆయన చచ్చిన పాము. టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. టీడీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎందుకు రాజధానిలో పర్యటన చేస్తానంటున్నారు. పార్లమెంట్‌లో చెప్పిన తరువాత కూడా రాజకీయాలు చేస్తున్నారు’అని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.
(చదవండి : ప్రజాసేవే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం.. బలం..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement