
మాట్లాడుతున్న మాదిగ రాజకీయ పోరాట సమితి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా అమరావతి రాజధాని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డులో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షలకు ముఖ్య అతిథిగా మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధాని అంటూ ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతోంది కేవలం తన బినామీలకు అడ్డాగా మార్చుకునేందుకేనని అన్నారు. అన్ని వర్గాలకు పాలనను చేరువ చేసేలా, సమాన అభివృద్ధే ధ్యేయంగా మూడు రాజధానులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తే చంద్రబాబు దానిని అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు.
►మూడు రాజధానులకు మద్దతుగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన కట్టెపోగు బసవరావు మాట్లాడుతూ నిజాలు నిగ్గు తేల్చాల్సిన కొన్ని మీడియా సంస్థలు అబద్ధాన్ని పదే పదే వల్లిస్తూ అమరావతి ఉద్యమాన్ని జాకీలతో లేపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనరాజు, దళిత వర్గాల ఫెడరేషన్ అధ్యక్షుడు చెట్టే రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment