
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Crazy 55 Million+ Views ♥️
Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥
🔗 https://t.co/ihtvtgPel9
In cinemas worldwide from 10th Jan.
GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024