‘దిల్‌ బేచారా’ మరో రికార్డు | DilBechara has over 75 million views in less than 24 hours | Sakshi
Sakshi News home page

‘దిల్‌ బేచారా’ మరో రికార్డు

Published Sat, Jul 25 2020 8:47 PM | Last Updated on Sat, Jul 25 2020 8:57 PM

DilBechara has over 75 million views in less than 24 hours - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివ‌రి సినిమా దిల్ బేచారా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏ భార‌తీయ చిత్రానికి రాని రేటింగ్స్ పొందిన ఈ మూవీ తాజాగా మరో రికార్డును  సొంతం చేసుకోవడం విశేషం. ఓటీటీ వేదిక‌గా రిలీజ్ అయిన  ఈ మూవీ విడుదలైన 24 గంటల్లోనే 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది.  దీంతో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన ఓటీటీ చిత్రంగా నిలిచింది.

ముఖేష్ చ‌బ్రా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ఐఎండీబీలో 10కి 10 రేటింగ్స్ సొంతం చేసుకొని టాప్ రేటేడ్ ఇండియ‌న్ ఫిల్మ్ గా నిలిచింది. కాగా 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా  తెరకెక్కిన ఈ మూవీ  ట్రైలర్‌ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. (దిల్‌ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement