విజయ్‌ వ్యూహం | Nagarjuna Wild Dog trailer hits 10 million views | Sakshi
Sakshi News home page

విజయ్‌ వ్యూహం

Published Sun, Mar 21 2021 1:56 AM | Last Updated on Sun, Mar 21 2021 10:06 AM

Nagarjuna Wild Dog trailer hits 10 million views - Sakshi

ప్రజల జీవితాల్లో అలజడి సృష్టించిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌  ఏజెన్సీ) ఏసీపీ విజయ్‌వర్మ ఓ ప్లాన్‌ వేశాడు. విజయ్‌ వ్యూహం ఎలా ఉంటుందో ‘వైల్డ్‌ డాగ్‌’లో చూడొచ్చు. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం.

వరుస బాంబు దాడులతో దేశంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులను తన టీమ్‌తో విజయ్‌ వర్మ ఎలా తుదముట్టించాడనే విషయాన్ని సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే 10 మిలియన్స్‌  వ్యూస్‌ వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఎన్‌ .ఎం. పాషా, జగన్మోహన్‌  వంచా సహ నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement