ఇటాలియన్ దీవి ‘ప్రిన్సిపి’లో ఒక కొత్తజాతికి చెందిన గుడ్లగూబను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆఫ్రికా పశ్చిమ తీరానికి ఆవల గల్ఫ్ ఆఫ్ గినీలో ఉన్న ఈ చిన్న దీవిలో తొలిసారిగా 2016లో ఈ జాతి గుడ్లగూబను గుర్తించారు. మరిన్ని పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు, ఈ జాతి గుడ్లగూబలు ‘ప్రిన్సిపి’ దీవిలో మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అందువల్ల దీనికి ‘ప్రిన్సిపి స్కోప్స్ ఔల్’ అని పేరు పెట్టారు.
ఈ గుడ్లగూబలు ఇతర జాతుల గుడ్లగూబల కంటే పరిమాణంలో కొంత చిన్నవిగా ఉంటాయి. మిగిలిన గుడ్లగూబలతో పోల్చితే వీటి కూత కూడా చాలా విలక్షణంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రిన్సిపి దీవికి చెందిన ఫారెస్ట్ రేంజర్ సెసిలియానో దొ బోమ్ జీసస్ అందించిన సమాచారంతో ఈ విలక్షణమైన గుడ్లగూబను గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment