చెర్కూర్‌లో సోమయ్య శవాన్ని వెలికి తీస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) సోమయ్య(ఫైల్)
నాగారం (తుంగతుర్తి) : ఒకే రాష్టం వారు.. 20ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. తనకు రావా ల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే.. దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూర్ గ్రామానికి చెందిన నల్లగంటి సోమ య్య (40) 20ఏళ్ల క్రితం బతుకు దెరువుకోసమని చెన్నై వెళ్లి ఆటోనడుపుతూ జీవనంసాగిస్తున్నాడు.
అక్కడ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మం డలం చెర్కూర్ గ్రామానికి చెందిన దొడ్ల జం గయ్య అనే వ్యక్తి చెన్నైలో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచ యం ఏర్పడింది. 20ఏళ్లుగా స్నేహితులుగా ఉం టున్నారు. ఇద్దరు కలిసి చిట్టీల వ్యాపారం నడుపుతున్నారు. ఈ వ్యాపారాన్ని పూర్తిగా జంగయ్యనే చూ సుకుంటున్నాడు. సోమయ్య తను సంపాదించిన డబ్బులతో సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
తనకు వచ్చే డబ్బులు ఇవ్వాలని జంగయ్యపై సోమయ్య ఒత్తిడి చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చే ఉద్దేశంలేని జంగయ్య ఎలాగైన సోమయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నా డు. పథకం ప్రకారం ఊరిలో రైతుబంధు చెక్కు డబ్బులు, తన పొలాన్ని అమ్ముతున్నాను, డబ్బులు వస్తాయి చెప్పి చెన్నైనుంచి చెర్కూరుకు వచ్చేశాడు. కొన్ని రోజుల తరువాత సోమయ్య డబ్బు ల కోసం జంగయ్యకు ఫోన్‌చేసి డబ్బులు విష యం అడగగా చెర్కూర్ సమీపంలో ఉన్న మరో గ్రామం పెద్దపూర్‌కు వస్తే ఇస్తానని చెప్పాడు.
దీంతో సోమయ్య మే 14న చెన్నై నుంచి బయలుదేరి మే15న పెద్దపూర్‌కు చేరుకున్నాడు. అక్కడనుంచి ఇద్దరు కలిసి చెర్కూర్ వెళ్లి మద్యం సేవించారు. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జంగయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం సోమయ్యను హత్యచేశాడు. తరువాత చెర్కూర్ గ్రామానికి చెందిన తన బామ్మర్ధి జాల క్రిష్ణయ్య సహాయంతో శవాన్ని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో పూడ్చిపెట్టాడు.
అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా చైన్నె వెళ్లిపోయాడు. మే14న వెళ్లిన సోమయ్య ఐదు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టారు. సోమ య్య ఆచూకీ లభిం చకపోవడంతో నాగారం పోలీస్‌స్టేషన్‌లో మే24న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమ య్య కాల్‌డేటా, సిగ్నల్ ప్రకారం.. జంగయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు.
తానే హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. శుక్రవారం సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీ సులు మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బతుకుదెరువు కోసం గ్రామస్తుడు దూరప్రాంతం వెళ్లి శవమై తిరిగి రావడంతో పసునూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment