friend murdered
-
అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చేశాడు
తిరువొత్తియూరు: వేటకు వెళ్లి అడవిపంది అనుకుని స్నేహితున్ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చేసాడు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన పసుప్ప (40). ఇతను, మిత్రుడు నాగరాజు (27)తో కలిసి గురువారం రాత్రి అటవీ ప్రాంతానికి ఇద్దరు నాటు తుపాకీలతో వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లారు. అర్ధరాత్రి నాగరాజు వెళ్లిన ప్రాంతంలో శబ్దం రావడంతో అడవిపంది అనుకుని తుపాకీతో కాల్చాడు. అక్కడికి వెళ్లి చూడగా తుపాకీ తూట దూసుకెళ్లి పసుప్ప మృతిచెంది వున్నాడు. ఇది చూసి నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొందరు పసుప్ప మృతిచెంది వుండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నాగరాజు కోసం గాలిస్తున్నారు. చదవండి: విహారం.. విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి చదవండి: కన్నిబల్: ఫ్రెండ్స్‌ని చంపి తిన్నాడు.. చదవండి: ఎంత పని చేశావు.. అమ్మ -
తాగిన మత్తులో స్నేహితున్ని చంపేశారు
సాక్షి, ఓర్వకల్లు(కర్నూలు) : మద్యంమత్తులో స్నేహితుల దాడిలో గాయపడిన ఓ యువకుడు కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం హత్య కేసుగా మార్పు చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని భైరాపురం గ్రామానికి చెందిన బొగ్గుల రంగస్వామి కుమారుడు బొగ్గుల రాజశేఖర్(29) కర్నూలు నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. రోజూ ఉదయంవెళ్లి సాయంత్రం గ్రామానికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గత నెల 27న కర్నూలు నుంచి లొద్దిపల్లె మీదుగా భైరాపురానికి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు కల్వర్టుపై కూర్చొని మద్యం తాగుతుండగా స్నేహితులు అదే గ్రామానికి చెందిన సిలువ రాజు, డోన్ రవి అక్కడకు చేరుకొని రాజశేఖర్‌తో కలిసి మద్యం తాగారు. తర్వాత రాత్రి 11.00 గంటలకు సిలువ రాజు, డోన్ రవి గ్రామానికి చేరుకొని రాజశేఖర్ అతిగా మద్యం తాగి బ్రిడ్జి నుంచి కిందపడ్డాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడివుండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిన తర్వాత కాస్త స్పృహలోకి వచ్చి తనపై ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు చెప్పి, సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. తలపై బలమైన రక్తగాయం కావడంతో పాటు శరీరంలో మూగ దెబ్బలు తగిలినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో ఎస్ఐ పోస్ట్‌మార్టం నివేదికలను కర్నూలు రూరల్ సీఐ పవన్ కిశోర్‌కు అందజేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హతుని భార్య రేణుక ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, డోన్ రవి, సిలువ రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూడ్చిన శవం వెలికితీత..
నాగారం (తుంగతుర్తి) : ఒకే రాష్టం వారు.. 20ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. తనకు రావా ల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే.. దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూర్ గ్రామానికి చెందిన నల్లగంటి సోమ య్య (40) 20ఏళ్ల క్రితం బతుకు దెరువుకోసమని చెన్నై వెళ్లి ఆటోనడుపుతూ జీవనంసాగిస్తున్నాడు. అక్కడ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మం డలం చెర్కూర్ గ్రామానికి చెందిన దొడ్ల జం గయ్య అనే వ్యక్తి చెన్నైలో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచ యం ఏర్పడింది. 20ఏళ్లుగా స్నేహితులుగా ఉం టున్నారు. ఇద్దరు కలిసి చిట్టీల వ్యాపారం నడుపుతున్నారు. ఈ వ్యాపారాన్ని పూర్తిగా జంగయ్యనే చూ సుకుంటున్నాడు. సోమయ్య తను సంపాదించిన డబ్బులతో సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనకు వచ్చే డబ్బులు ఇవ్వాలని జంగయ్యపై సోమయ్య ఒత్తిడి చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చే ఉద్దేశంలేని జంగయ్య ఎలాగైన సోమయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నా డు. పథకం ప్రకారం ఊరిలో రైతుబంధు చెక్కు డబ్బులు, తన పొలాన్ని అమ్ముతున్నాను, డబ్బులు వస్తాయి చెప్పి చెన్నైనుంచి చెర్కూరుకు వచ్చేశాడు. కొన్ని రోజుల తరువాత సోమయ్య డబ్బు ల కోసం జంగయ్యకు ఫోన్‌చేసి డబ్బులు విష యం అడగగా చెర్కూర్ సమీపంలో ఉన్న మరో గ్రామం పెద్దపూర్‌కు వస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో సోమయ్య మే 14న చెన్నై నుంచి బయలుదేరి మే15న పెద్దపూర్‌కు చేరుకున్నాడు. అక్కడనుంచి ఇద్దరు కలిసి చెర్కూర్ వెళ్లి మద్యం సేవించారు. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జంగయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం సోమయ్యను హత్యచేశాడు. తరువాత చెర్కూర్ గ్రామానికి చెందిన తన బామ్మర్ధి జాల క్రిష్ణయ్య సహాయంతో శవాన్ని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో పూడ్చిపెట్టాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా చైన్నె వెళ్లిపోయాడు. మే14న వెళ్లిన సోమయ్య ఐదు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టారు. సోమ య్య ఆచూకీ లభిం చకపోవడంతో నాగారం పోలీస్‌స్టేషన్‌లో మే24న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమ య్య కాల్‌డేటా, సిగ్నల్ ప్రకారం.. జంగయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. శుక్రవారం సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీ సులు మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బతుకుదెరువు కోసం గ్రామస్తుడు దూరప్రాంతం వెళ్లి శవమై తిరిగి రావడంతో పసునూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
80 రూపాయల కోసం స్నేహితుడి హత్య!
బీరు బాటిల్ కోసమో, బిర్యానీ పొట్లం కోసమో హత్యలు జరగడం చూశాం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 80 రూపాయలు పంచుకునే విషయంలో గొడవ పడి ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేశాడు. వినోద్ అనే వ్యక్తిని పీక పిసికి చంపేసిన కేసులో పప్పు యాదవ్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ గత మూడు నాలుగేళ్లుగా కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్లు యమునా బజార్లో పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నైట్ షెల్టర్‌లో ఉంటున్నారు. అక్టోబర్ 30న వాళ్లు జనక్‌పురిలో ఓ కార్యక్రమం జరిగితే అక్కడ పనిచేశారు. వాళ్ల పనితీరు నచ్చిన నిర్వాహకుడు శనివారం నాడు వాళ్లకు రూ. 100 ఇచ్చి పంచుకోమని చెప్పాడు. అందులో 20 రూపాయలతో మద్యం కొనుక్కుని అక్కడే తాగడం మొదలుపెట్టారు. మిగిలిన 8౦ రూపాయలు పంచుకోవాల్సి ఉంది. కానీ, తాగిన మత్తులో ఇద్దరూ ఆ మొత్తం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవలో పప్పు ఓ తాడు తీసుకుని వినోద్ పీక పిసికి, అక్కడినుంచి పారిపోయాడు.