Sai Pallavi Revealed About Her Best Friends In Tollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi Best Friends: ఆ తెలుగు స్టార్‌ హీరోలు సాయి పల్లవి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అట, వారెవరంటే..

Published Thu, Jun 30 2022 11:46 AM | Last Updated on Thu, Jun 30 2022 12:46 PM

Sai Pallavi Revealed Rana and Naga Chaitanya Is Her Best Friends - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ చేత లేడీ పవర్‌ స్టార్‌గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది.

చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్‌

దీంతో విరాట పర్వం చిత్రం బృందం మూవీ సక్సెస్‌ మీట్స్‌, ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ చానల్‌తో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. టాలీవుడ్‌లో తనకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారంటూ ఇద్దరు స్టార్‌ హీరోల పేర్లు చేప్పింది ఆమె. అయితే వారిద్దరు ఒకే కటుంబానికి చెందిన వారు కావడం విశేషం. కాగా అక్కినేని హీరోలు నాగచైతన్య, దగ్గుబాటి వారసుడు రానాలు పరిశ్రమలో తనకు మంచి స్నేహితులని, వారితో ఒక ఫ్యామిలీ అనే ఫిలింగ్‌ వస్తుందని చెప్పింది. ఒకే ఫ్యామిలీలా రానా, చైతులు తనపై కేర్‌ తీసుకుంటారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

చదవండి: ఓటీటీలోకి 'విరాట పర్వం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

ఇటీవల నాగ చైతన్య సరసన ఆమె నటించిన లవ్‌స్టోరీ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా రానాతో నటించిన విరాట పర్వం కూడా మంచి విజయం సాధించింది. కాగా సాయి పల్లవి ప్రస్తుతం ‘గార్గి’ చిత్రంలో న‌టిస్తుంది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌లే సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్, మేకింగ్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. మ‌హిళా ప్ర‌ధాన చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా త‌మిళం, తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement