షారుక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా! | Who are Shah Rukh Khan’s best friends? | Sakshi
Sakshi News home page

షారుక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా!

Nov 3 2015 1:39 PM | Updated on Sep 3 2017 11:57 AM

మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది.

ముంబై:  మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్ బెస్ట్  ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది.   సోమవారం 50వ పడిలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్   స్టార్  ప్రపంచ వ్యాప్తంగా తనకున్న  మంచి స్నేహితుల వివరాలను వెల్లడించాడు.   అంతేనా.. ఇంకో విషయాన్ని కూడా  తెలియజేశాడు. వయసులో అర్థ  సెంచరీ పూర్తి చేసిన  ఈ దిల్ వాలే  .. ఈ సందర్భంగా తానొక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడట... అవును..  ఇంతకీ  ఎవరా  బెస్ట్ ఫ్రెండ్స్, ఏమిటీ నిర్ణయం.


నిజంగా, ఇది అభిమానులందరికీ తీపికబురు. విశ్వవాప్తంగా లక్షలాదిగా ఉన్న తన అభిమానులందరూ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని షారుక్ ఖాన్ తేల్చారు. నిన్న తన పుట్టిన రోజు  వేడుక సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ దిల్ తో పాగల్ హై హీరో  ఇలా  సెలవిచ్చాడు.. నాకోసం   ప్రేమను పంచిన  వాళ్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు నాతో ఉంటే బావుంటుంది.. నా ఉద్దేశంలో.. నా ఫ్యాన్సే నా స్నేహితులు. వాళ్లే  నా బెస్ట్ ప్రెండ్స్  అన్నాడు.


దీంతో పాటు అభిమానులకు కొన్ని  సూచనలు కూడా చేశాడీ బాద్ షా. దుర్భాషలాడకూడదంటూ హితవు పలుకుతూ....  ఏదైనా  విషయం నచ్చక పోతే  మొఖం మీద తప్ప, వెనక మాట్లాడకూడదన్నాడు.  అలాగే తన పిల్లల గురించి మాట్లాడడ్డం కూడా తనకు నచ్చదని స్పష్టం చేశాడు.

ఇంతకీ ఈ సందర్బంగా   షారుక్ ఖాన్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటో తెలుసా..  ఎపుడూ నవ్వుతూ ఉండడమేనట.  జీవితంలో 18, 21, 40, 50, 75  ఏళ్లలోకి అడుగు పెట్టడం కీలకమైన విషయమని,  అర్థసెంచరీ కొట్టిన సందర్భంగా సదా నవ్వుతూ  ఉండాలని  తీర్మానించుకున్నాడట.  ఈసందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు, అభిమానులు , మిత్రులు అందిరికీ కృతజ్ఙతలు తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement