
హీరో భార్యకు వెన్నులో వణుకు..
నిప్పుకణికల్లా రగిలే కళ్లు, పెద్దపెద్ద గోర్లు, భయానికే భయం పుట్టించే ఆకారంతో (రోబో)2.0లో విలన్ గా కనిపిస్తోన్న అక్షయ్ కుమార్ గెటప్ చూసి ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బెదిరిపోయిందట! సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంతుతోన్న రోబో 2.0కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదలైంది. రజనీ వశీకర్ పాత్రలో కొనసాగుతుండగా, అక్షయ్ ‘క్రౌమ్యాన్’గా తలపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఫస్ట్ లుక్‌తో రెట్టింపయ్యాయి.
2.0లో రజనీ, అక్షయ్ ల గెటప్ లపై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చలు జరుగుతుండగానే అక్షయ్ భార్య ట్వింకిల్ ‘15 ఏళ్ల తర్వాత కూడా మా ఆయన నా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు’ అని ట్విట్టర్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ పాత్ర పురాణాల్లోని రాక్షసుడిలా ఉందని ఆమె పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి (త్రీడీలో) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన ఫస్ట్ లుక్ వేడుకల్లో (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, హీరోయిన్ అమీ జాక్సన్‌లతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. (అక్షయ్‌కుమారే ‘2.0’ హీరో - రజనీకాంత్)
Mr K after 15 years you still manage to send shivers down my spine :) #savage https://t.co/UuiHJOS2Jc
— Twinkle Khanna (@mrsfunnybones) 21 November 2016