విలన్‌గా సుదీప్ బెస్ట్... | Villain   Sudeep Best ... | Sakshi
Sakshi News home page

విలన్‌గా సుదీప్ బెస్ట్...

Mar 14 2014 11:30 PM | Updated on Sep 2 2017 4:42 AM

విలన్‌గా  సుదీప్ బెస్ట్...

విలన్‌గా సుదీప్ బెస్ట్...

‘‘నేను బెస్ట్ విలన్ అనే ఫీలింగ్ నాకుండేది. కానీ, నాకన్నా నువ్వే బెస్ట్..

‘‘నేను బెస్ట్ విలన్ అనే ఫీలింగ్ నాకుండేది. కానీ, నాకన్నా నువ్వే బెస్ట్...’’ అని ‘ఈగ’ సినిమా చూసి, సుదీప్‌ని అభినందించారు రజనీకాంత్. ఆయన విలన్‌గానే ఫస్ట్ పాపులర్ అన్న విషయం తెలిసిందే.

విలనిజాన్ని కూడా స్టయిల్‌గా ఆవిష్కరించేవారాయన. అలాంటి రజనీ తనను అభినందించడంపట్ల సుదీప్ చాలా ఆనందపడ్డారు. కేవలం అభినందించడమే కాదు.. తన సినిమాలోనూ విలన్‌గా సుదీప్ అయితే బాగుంటుందని రజనీ భావించారట. ఈ సూపర్ స్టార్ నటించిన ‘విక్రమసింహా’ త్వరలో విడుదల కానుంది. దాంతో తదుపరి చిత్రంపై దృష్టి సారించారు రజనీ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాలనుకుంటున్నారు.

ఇందులో సుదీప్‌ని విలన్‌గా తీసుకుంటే బాగుంటుందని రవికుమార్‌కి సూచించారట రజనీ. సుదీప్ చాలా స్టయిలిష్ యాక్టర్. ఇక రజనీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సో... ఈ స్టయిలిష్ యాక్టర్స్ కాంబినేషన్ ప్రేక్షకులకు కావాల్సినంత  వినోదం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement