నకిలీ ఫేస్‌బుక్‌తో దుష్ర్పచారం | suri gave complaint regard duplicate facebook account | Sakshi
Sakshi News home page

నకిలీ ఫేస్‌బుక్‌తో దుష్ర్పచారం

Published Sat, Jan 4 2014 2:22 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

suri gave complaint regard duplicate facebook account

హాస్యనటుడు సూరి ఫిర్యాదు
 తమిళసినిమా, న్యూస్‌లైన్:
 తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ప్రారంభించి దుష్ర్పచారం చేస్తున్నారంటూ హాస్యనటుడు సూరి శుక్రవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను తమిళ సినిమాలో  హాస్యనటుడుగా వెలుగొందుతున్నట్లు తెలిపారు.   నటుడు రజనీకాంత్ గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొందరు పాత్రికేయ మిత్రులు ప్రశ్నించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దీని గురించి ఆరా తీయగా తన పేరుతో కొందరు నకిలీ ఫేస్‌బుక్ , ట్విట్టర్‌ను నెలకొల్పి తాను చెప్పినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని తెలిపారు.
 
 తాను ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే స్థాయికి చదువుకోలేదని పేర్కొన్నారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ట్విట్టర్లను ప్రారంభించి దుష్ఫచారం చేస్తున్న వారిని కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని నటుడు సూరి కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement