
ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కోటి వ్యూస్
ప్రస్తుతం నార్త్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్ స్టార్ల లిస్ట్లో అందరి కంటే ముందున్న హీరో ప్రభాస్. బాహుబలి సక్సెస్తో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో. బాహుబలి సినిమా సౌత్తో పాటు నార్త్లో కూడా భారీ వసూళ్లను సాధించటంతో ప్రభాస్ గత సినిమాలను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ నిర్మాతలు.
ప్రభాస్ కెరీర్లోనే భారీ ఫ్లాప్గా నిలిచిన రెబల్ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లో పెద్దగా సందడి చేయకపోయినా యూట్యూబ్లో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కోటిగా పైగా వ్యూస్ రావటంతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ స్టార్గా రికార్డ్ సృష్టించాడు బాహుబలి. గతంలో కేవలం రజనీకాంత్ హీరోగా నటించిన సినిమాలకు మాత్రం ఇలాంటి రికార్డ్లు సాధ్యమయ్యేవి. కానీ ప్రభాస్ జోరు చూస్తుంటే నార్త్లో రజనీ రికార్డ్ను బ్రేక్ చేసేలాగే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.