Rebel
-
పవన్‌ను బహిష్కరించిన బీజేపీ
రెబల్ అభ్యర్థిగా.. పార్టీకి తలనొప్పిగా మారిన భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎన్డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. వాస్తవానికి.. లోక్‌సభ ఎన్నికల కోసం 200 మందితో కూడిన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది బీజేపీ. కానీ, పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని పవన్ సింగ్.. బీజేపీకి క్షమాపణలు చెప్పారు. అయితే సొంత రాష్ట్రంలో పోటీ చేసేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో.. బీజేపీ తరఫున బీహార్‌లో పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆర్జేడీ తరఫున టికెట్ కోసం కూడా యత్నించారు. రెండు వైపుల నుంచి ఆయన సానుకూలత దక్కలేదు. చివరకు.. కారాకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడమే కాకుండా.. తన తల్లితోనూ ముందు జాగ్రత్తగా మరో నామినేషన్ వేయించారు. చివరకు ఉపసంహరణ గడువు ముగిసేనాడు.. తన తల్లితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తీవ్రంగా పరిగణించింది.మరోవైపు పవన్ సింగ్‌ను కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయని బీజేపీ.. చివరకు పవన్‌పై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కారాకాట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్)ఎల్ తరఫున రాజా రామ్ సింగ్ కుష్వాహా బరిలో ఉన్నారు. జూన్ 1వ తేదీన కారాకాట్కు పోలింగ్ జరగనుంది. -
'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ
'ప్రేమలు' అనే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన మమిత బైజు.. ఇదే మూవీ డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మాయలో పడేసింది. ఈమె హీరోయిన్గా నటించిన తమిళ సినిమా 'రెబల్'. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ హీరో. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. నికేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తమిళం గురించి బలంగా చెప్పే చిత్రం ఇది అని, దర్శకుడు నికేశ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకున్నాడని, అలా తీసిన సినిమానే 'రెబల్' అని హీరో జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజూ చాలా చక్కగా నటించిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) -
మాట తప్పుతున్న ప్రభాస్..ఫాన్స్ కు షాక్
-
రెబల్‌గా మారుతున్న ఐటీ ఉద్యోగులు.. తలలు పట్టుకుంటున్న కంపెనీలు!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీలు స్వస్తి చెప్పేశాయి. కొంతకాలం హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మొత్తంగా ఆఫీస్‌కి రావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్‌కు రాబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. జర్మన్ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఇటీవల రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. బలవంతంగా ఆఫీసులకు పిలిస్తే రాజీనామా చేస్తామంటూ సుమారు 5 వేల మంది ఉద్యోగులు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్-సైట్ వర్క్ గైడెన్స్ జారీ చేయడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చిన కంపెనీ ఆకస్మికంగా విధానాలను మార్చడం అసమంజసమని శాప్ యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ మాత్రం ఉద్యోగులను సాంస్కృతికంగా దగ్గర చేయడం, మార్గదర్శకత్వం, ఉత్పాదకత వంటి వాటి కోసం క్యాంపస్ కో-లొకేషన్ చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు. ప్రమోషన్లకు కీలకం.. రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను పరిశ్రమ ఉత్తమ పద్ధతులు, అంతర్గత అభ్యాసాలు తెలియజేస్తున్నాయని శాప్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్ కంపెనీలలో శాప్ కూడా ఒకటి. కానీ 2022 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఆన్-సైట్ వర్క్ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి. టీసీఎస్ కూడా.. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టు ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనట్లు నివేదికలు వచ్చాయి. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం కంపెనీ చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. -
Rebel Teaser Out: హీరోగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మూవీ.. టీజర్లో యాక్షన్ మాత్రం
ఆ మ్యూజిక్ డైరెక్టర్.. సంగీతం కంపోజ్ చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు హీరోగానూ డిఫరెంట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. అలా ఓ వైపు స్టార్ హీరోల మూవీస్ కి పనిచేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. ఇప్పుడు 'రెబల్' అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన జీవీ.. 'రెబల్'తో యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) స్టూడియో గ్రీన్ పతాకంపై కే.జి.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూనే సంగీతం కూడా అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో సూర్య.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్.. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. టీజర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట ఓ ఫైట్ సీన్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాపై టీజర్ దెబ్బకు అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
నడిరోడ్డుపై నిలబెట్టి కొడతా: రేఖా నాయక్
సాక్షి, నిర్మల్ : ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. తానింక బీఆర్ఎస్లోనే ఉన్నానని రేఖా నాయక్.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్ రమేష్ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్ నాయక్ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె. జాన్సన్ నాయక్‌కు ఏం తెల్వదు. కేవలం కేటీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ అనే టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఖానాపూర్ విషయంలో తనకు టికెట్ ఇవ్వనప్పుడు.. స్థానికులకు ఎవరికైనా టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా జాన్సన్‌కు ఇవ్వడం అభ్యంతరకరంగా ఉంది. నేను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.నేను ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో కేటీఆర్ సమక్షంలోనే.. డిగ్రీ కాలేజ్.. రెవెన్యూ డివిజన్ అడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారామె. ఈ క్రమంలోనే.. అబద్దాలు ప్రచారంచేస్తే జాన్సన్ నాయక్‌ను నడిరోడ్డు పై నిలబెట్టి కొట్టడానికి వెనకాడబోనని హెచ్చరించారామె. న్నారు. జాన్సన్‌ను ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నాడని.. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేస్తున్నాడని రేఖా నాయక్ ఆరోపించారు. తనకు సెక్యూరిటీని తగ్గించేశారని.. తన అనుచరులనూ బైండోవర్లు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పుడేం కాలేదు బిడ్డా.. ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమంటూ జాన్సన్ నాయక్‌కు ఉద్దేశించి రేఖా నాయక్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. -
పాతిక వేలమంది చావడానికి రెడీ.. మాస్కోలో హైఅలర్ట్
మాస్కో: రష్యాలో తిరుగుబాటు జెండా ఎగిరింది. కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేశాయి. క్రెమ్లిన్ ఆయనపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ పరిణామంతో చిర్రెత్తిపోయిన ప్రిగోజిన్.. రష్యా సైన్యంపై ప్రతిదాడికి ఆదేశాలిచ్చాడు. అంతేకాదు రష్యాలో వినాశనం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మా సైన్యం పాతికవేల మంది. అంతా చావడానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా కోసం ఏమైనా చేస్తాం. మేమింకా ముందుకు వెళ్తాం. అడ్డొచ్చిన ప్రతీది నాశనం చేసి ముగిస్తాం అంటూ ప్రిగోజిన్ ఆడియో సందేశం పంపించాడు. అంతేకాదు.. ఇప్పటికే వార్నర్ గ్రూప్ రోస్తోవ్ రీజియన్‌లోకి ప్రవేశించిందంటూ ప్రకటించారాయన. మార్చ్‌గా పలు నగరాల వైపు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో.. మాస్కోతో పాటు పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహిత వర్గమైన ఈ వాగ్నర్ ప్రైవేటు సైన్యం గతంలో తమతో కలిసి ఉక్రెయిన్ పై పోరాడటంలో సహకరించింది. కానీ ఇప్పుడు వారితో వైరం రష్యా సైన్యానికి పెను ప్రమాదమే తెచ్చిపెట్టింది. రష్యా మిలిటరీ తన గ్రూపును లక్ష్యంగా చేసుకుని క్షిపణుల దాడకి దిగుతోందని.. ప్రతిఘటన కొనసాగుతుందని యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించాడు. పుతిన్ శత్రువైన మిఖాయిల్ ఖోదోర్ కోవ్స్కీ కూడా యెవనిన్ ప్రిగోజిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా ప్రజానీకానికి పిలుపునివ్వడం విశేషం యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయం తోపాటు ఎఫ్.ఎస్.బి డిపార్ట్మెంటును, ఒక పోలీస్ డిపార్ట్మెంటును కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు లోకల్ చానళ్లు ప్రసారం చేస్తున్నప్పటికీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. 📢Chronicles of the military coup in the Russian Federation.📢 By today's morning, Prigozhin announced that he had taken control of the city of the regional center - the city of Rostov.#Europe #Russia #RussiaUkraineWar #RussiaIsLosing #Russland pic.twitter.com/dI95o18GPG — Denis Jankauskas (@artsenvacatures) June 24, 2023 రోస్తోవ్లోకి వార్నర్ గ్రూప్ ప్రవేశించిందని ప్రిగోజిన్ ప్రకటించినప్పటికీ.. సైన్యం దానిని ధృవీకరించలేదు. కానీ తిరుగుబాటు సైన్యం రాక గురించిన సమాచారమందగానే రష్యా సైన్యం ప్రజలను అప్రమత్తం చేసిన ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు కదలవద్దని హెచ్చరించింది. మాస్కో నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను తీసుకుని రక్షణ వలయాన్ని పటిష్టం చేయనున్నామని తెలిపారు. లిపెట్స్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలను, స్థానిక భద్రతా దళాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు లిపెట్స్క్ గవర్నర్ ఇగర్ అర్థమొనోవ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. పుతిన్‌కు బాగా క్లోజ్.. ► యెవ్జెనీ ప్రిగోజిన్. 1961 రష్యాలో జన్మించారు. 1990 నుంచి పుతిన్‌తో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో ప్రిగోజిన్ రాజకీయ చర్చకు సైతం దారి తీశారు. ► పొలిటికో ప్రకారం.. ప్రిగోజిన్, పుతిన్ ఒకే ఊరివాళ్లు(అప్పుడు లెనిన్గ్రాడ్.. ఇప్పుడు సెయింట్ పీటర్బర్గ్). 18 ఏళ్ల వయసులోనే క్రిమినల్‌గా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత దొంగతనం కేసులోనూ జైలుపాలయ్యాడు. ఆపై 13 ఏళ్లకు దోపిడీ కేసులో 13 ఏళ్ల జైలు శిక్షపడి.. అందులో 9 ఏళ్లపాటు శిక్ష అనుభవించాడు. ► జైలు నుంచి బయటకు వచ్చాక హాడ్డాగ్స్ అమ్ముతూ జీవనం కొనసాగించాడు. అటుపై సెయింట్ పీటర్‌బర్గ్‌లో ఖరీదైన రెస్టారెంట్లను తెరిచాడు. ► పుతిన్ చెఫ్‌గా ప్రిగోజిన్‌కి ఓ పేరుంది. రెస్టారెంట్ బిజినెస్ కాటరింగ్ ఆర్డర్స్‌తో ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యాడు ప్రిగోజిన్. ఆ తర్వాత మీడియా రంగం, ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించాడతను. ► ఈ ఏడాది జనవరిలో 62 ఏళ్ల ప్రిగోజిన్.. రష్యా సైన్యానికి తోడుగా ప్రైవేట్ సైన్యం వాగ్నర్‌తో ఉక్రెయిన్ యుద్ధంలో భాగం పంచుకుంటూ వస్తున్నాడు. ఉక్రెయిన్‌లోనే కాదు.. ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, లిబియా, మాలిలోనూ వాగ్నర్ గ్రూప్ దురాగతాలు కొనసాగుతున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇదీ చదవండి: నూతన రంగాల్లోనూ కలిసి ముందుకు -
రష్యా ఓటింగ్ నిర్వహించనుందా? అప్పుడూ అలానే ఉక్రెయిన్ నుంచి వాటిని లాక్కొంది!
May Vote On Joining Russia: రష్యా గత నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతేగాక రష్యా ఇటీవలే తన తొలి సైనిక చర్య పూర్తయిందని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రిపబ్లిక్ భూభాగంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగవచ్చు అని ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ వేర్పాటువాద ప్రాంత అధిపతి లియోనిడ్ పసెచ్నిక్ పేర్కొన్నారు. అంతేకాదు రష్యా ఈ సమయంలో ప్రజలు రష్యన్ ఫెడరేషన్లో చేరడంపై అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయమై రష్యా చట్ట సభ సభ్యుడు లియోనిడ్ కలాష్నికోవ్ మాత్రం ఇప్పుడూ అలా చేసేందుకు సరైన సమయం కాదన్నారు. అయితే ఉక్రెయిన్‌కి తూర్పున ఉన్న స్వయం ప్రకటిత డోనెట్స్క్ లుగాన్స్క్ రిపబ్లిక్లకు రక్షణగా వ్యవహరిస్తోందని రష్యా పేర్కొంది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని రష్యా ఎగువ సభలోని రాజ్యాంగ శాసన కమిటీ అధిపతి ఆండ్రీ క్లిషాస్ అన్నారు. ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాన్ని రష్యా గుర్తించినట్లు ప్రకటించింది కూడా. ఈ ప్రాంతాల అధికారులు తమ రాజ్యాంగాలకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారిక ఉందని స్పష్టం చేసింది. రష్యన్ మాట్లాడే ప్రాంతాలు 2014లో 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి కైవ్ నియంత్రణ నుంచి వైదొలగాయి. ఫిబ్రవరి 2014లో కైవ్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటులో మాస్కో అనుకూల నాయకుడిని తొలగించి, రష్యాలో భాగమవడంపై దక్షిణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది. కాబట్టి మళ్లీ ఇప్పుడూ కూడా రష్యా అలానే చేస్తుందేమోనని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రష్యా పై నోరు పారేసుకోవడమే తప్ప ఉక్రెయిన్‌కి చేసిందేమీ లేదు! ఉక్రెయిన్ ఎంపీ) -
తెలంగాణ బీజేపీలో మళ్లీ అసంతృప్తి సెగలు
-
బీజేపీ ‘బండి’లో సీనియర్స్‌కు సీటేది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక తమకు ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదంటూ వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తమ వాదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో అసంతృప్తనేతలు విడిగా సమావేశం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. అసంతృప్త నేతల సమావేశాలు ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్, మరో ఒకట్రెండు జిల్లాల్లో జరిగాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన భేటీ సీనియర్లు–జూనియర్లు, పాత–కొత్త నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని ఎత్తిచూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలవారీగా చూస్తే... కరీంనగర్లో గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర రావు, అర్జున్‌రావు, వరంగల్‌లో డాక్టర్టి.రాజేశ్వరరావు, ఎం.ధర్మారావు, నిజామాబాద్‌లో యెండల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి వెంకటరమణి, మహబూబ్‌నగర్‌లో నాగూరావు నామాజీ, నల్లగొండలో కంకణాల శ్రీధర్‌రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో బొబ్బ భాగ్యరెడ్డి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేయడమేకాక.. గుర్రంబోడు తండాలో గిరిజనుల భూముల విషయంలో అనేక కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. తాజాగా ఆ నియోజకవర్గంలో మరో నేత రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా, సీనియర్లు సుదీర్ఘకాలం రాష్ట్ర పదాధికారులుగా, వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారని, పార్టీలో, ఇతరత్రా పదవులు తక్కువగా ఉన్నందున ఈసారి కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. సీనియర్లను విస్మరిస్తే ఎలా? హైదరాబాద్‌లో కలుసుకున్న సీనియర్ నేతల్లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, టి.రాజేశ్వరరావు, చింతా సాంబమూర్తి, వెంకటరమణి తదితరులున్నారు. ‘ఇది రహస్య సమావేశమేమీ కాదు. పార్టీ బలపడుతున్న క్రమంలో కొత్తవారిని చేర్చుకోవాల్సిందే. ఏళ్ల తరబడి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం కృషి చేసిన, త్యాగాలు చేసి పార్టీని రక్షించుకున్న సీనియర్లను విస్మరించడం సరికాదు. అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. ఒంటెద్దు పోకడలు అనుసరించడం సరికాదు. సమస్య పరిష్కారానికి పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్టీ సంస్థాగత జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ వెంటనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఈ అంశంపై పార్టీ స్పందించే తీరునుబట్టి తర్వాతి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం’అని భేటీలో పాల్గొన్న నాయకులు ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా అసంతృప్త నేతల సమావేశాలు, చర్యలను తేలికగా తీసుకునే ప్రసక్తే లేదన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇస్తోంది. -
ఉక్రెయిన్ ఆక్రమణ.. పుతిన్ స్ట్రాటజీకి అమెరికా కౌంటర్?
రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదురుతోంది. వెనక్కి తగ్గినట్లే తగ్గి.. దూకుడు చూపిస్తోంది రష్యా. ప్రతిగా అమెరికా కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా వేర్పాటువాద ప్రాంతాల మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది రష్యా. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. రష్యాకి దన్నుగా నిలుస్తున్న ఉక్రెయిన్ తూర్పు వైపు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలకు ఊహించని ఝలక్ ఇచ్చింది అమెరికా. ఆర్థిక ఆంక్షలతో పాటు రష్యా మీదా కొత్త ఆంక్షలను విధించనున్నట్లు ఇవాళ (మంగళవారం) ప్రకటించేసింది. ఒకపక్క రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ తిరుగుబాటునేతలతో క్లెమ్లిన్‌లో సమావేశమై.. పరస్సర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై సంతకం చేశాడు. ఆ వెంటనే డోనెట్స్క్, లుగన్స్క్లను(ఉక్రెయిన్ రెబల్ ప్రాంతాలు) స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు పుతిన్. ఉక్రెయిన్ను పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా, ఒక విఫల రాజ్యంగా అభివర్ణించాడు. అంతేకాదు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో తిష్ట వేయాలని రష్యా సైన్యాన్ని ఆదేశించాడు కూడా. ఈ నేపథ్యంలో.. అమెరికా వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆ రెండు రెబల్ రాజ్యాలపై ఆంక్షలు విధించింది. ‘అంతర్జాతీయ చట్టాల కఠోరమైన ఉల్లంఘనలకు గానూ ప్రతిగా రష్యాకు ఒరిగే లాభాన్ని దూరం చేయడానికే(రెబల్స్‌తో ఒప్పందాన్ని ఉద్దేశించి) నేను ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశా. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. తదుపరి చర్యలపై ఉక్రెయిన్‌తో సహా మిత్రదేశాలు, భాగస్వాములతో అమెరికా సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతోంది.’ : తాజా ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రెబల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొద్దంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ముందు నుంచి రష్యాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ హెచ్చరికలను తుంగలో తొక్కి.. సంక్షోభాన్ని చల్లబర్చే పరిస్థితుల్ని మరింత సంక్లిష్టం చేసింది రష్యా. రెబల్స్ మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, దాడులకు తెగబడుతోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ.. తాము దౌత్యపరమైన చర్చలకు సిద్ధమని, కేవలం సరిహద్దు డ్రిల్స్‌ను ముప్పుగా ఎలా పరిగణిస్తారని రష్యా వాదిస్తోంది. ఆక్రమణ మొదలైనట్లే.. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్, అమెరికా, మెక్సికో, ఐదు యూరోపియన్ దేశాల విజ్ఞప్తి మేరకే ఈ సమావేశం నిర్వహించింది భద్రతా మండలి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఆక్రమణ మొదలుపెట్టిందంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ప్రకటించడం విశేషం. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధిస్తోంది’’ అని ప్రకటించారాయన. ఉక్రెయిన్ సంక్షోభంపై మంగళవారం జరిగిన emergency government response meetingకి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. -
ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్ బెడద ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నియోజకవర్లాల్లో తిరుగుబాటు అభ్యర్థులు సవాల్ విసురుతూ ఉంటే, బీజేపీ ఏకంగా పన్నెండు స్థానాల్లో రెబెల్స్‌ను ఎదుర్కొంటోంది. ఇక రెండు పార్టీల్లోనూ అసమ్మతి నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో విజయావకాశాలు తారుమారు అవుతాయేమోనన్న ఆందోళనైతే నెలకొంది. రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని బుజ్జగించి నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని రెండు పార్టీలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ 20కిపైగా స్థానాల్లో పోటీ తప్పేటట్టుగా లేదు. బీజేపీ టికెట్లు ఇవ్వడానికి ముందు సర్వే నిర్వహించి పని తీరు బాగాలేని ఎమ్మెల్యేలని పక్కన బెట్టింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావహులెందరికో టికెట్ లభించలేదు. దీంతో యమునోత్రి, బాజ్పూర్, రుద్రప్రయాగ్, సితార్‌గంజ్, రామ్‌నగర్, బాగేశ్వర్, జ్ఞానశాలి, డెహ్రాడూన్ కాంట్, కిచా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబెల్స్ బరిలో ఉన్నారు. చివరికి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్ రావత్‌కి కూడా తిరుగుబాటు అభ్యర్థి తలపోటు తెప్పిస్తున్నారు. రావత్‌ను పోటీకి దింపాలనుకున్న రామ్‌పూర్‌లో టికెట్ ఆశించి భంగపడిన రెబెల్ అభ్యర్థి రంజిత్ రావత్ బరిలోకి దిగారు. దీంతో రావత్‌ను రామ్‌నగర్ నుంచి లాల్‌కౌన్ అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. అప్పటికే అక్కడ సీటు ఖరారు చేసిన సంధ్య దాలకోటికి కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ పరిణామాలతో రావత్‌కు రెబెల్ బాధ తప్పలేదు. ఇక యమునోత్రిలో రెబెల్ అభ్యర్థి సంజయ్ బోధల్ రిషికేశ్‌లో షర్బీర్ సింగ్, రుద్రప్రయాగలో మత్బర్ సింగ్ ఖండారీలు ఎక్కువ బలంగా ఉండడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. బీజేపీలో ఎగుస్తున్న అసమ్మతి జ్వాలలు ఇక బీజేపీకి రుద్రపూర్, భింతాల్, కిచా, కుమావూ, ధంతోలి, డెహ్రాడూన్ కాంట్, ధర్మపూర్, యమునోత్రి, కర్ణప్రయాగ, చక్రత, ఘనశాలి. కోట్వార్‌లలో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి జ్వాలలు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈనెల 14న పోలింగ్ జరిగే ఉత్తరాఖండ్‌లో సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోతూ ఉండటంతో బీజేపీ ఇంకా రెబెల్స్‌ని బుజ్జగించే పనిలోనే ఉంది. బీజేపీ మొత్తం 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. ఇంచుమించుగా వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డారు. వాటికి తోడు పార్టీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలో కమలనాథులున్నారు. -
రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!
జైపూర్: రాజస్తాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పైలట్ మద్దతుదారు భన్వర్‌లాల్ శర్మ సీఎం అశోక్ గహ్లోత్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గహ్లోత్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ నేతనేనని స్పష్టం చేశారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్, గహ్లోత్ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై బయటికొచ్చిన ఆడియో టేపుల వ్యవహారాన్ని భన్వర్‌లాల్ తోసిపుచ్చారు. ఎలాంటి ఆడియో టేపులు లేవని, అవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. తనకు గజేంద్ర సింగ్ మాత్రమే తెలుసని, షెకావత్, సంజయ్ జైన్ ఎవరో తెలియదని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వారి సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా కాంగ్రెస్ బయటపెట్టింది. ఆడియో టేపుల్లో భన్వర్‌లాల్ పేరు ప్రముఖంగా వినపడింది. (రాజీ ఫార్ములాపై రాహుల్, పైలట్ మంతనాలు) -
రాహుల్ సేనపై దృష్టి
న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితర తనకు సన్నిహితులైన యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా రాహుల్ గాంధీ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు. తాజాగా, రాజస్తాన్‌లో సచిన్ పైలట్ రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దాంతో, ఇప్పుడు అందరి దృష్టి రాహుల్ బ్రిగేడ్‌లో మిగిలిన నాయకులపై పడింది. ‘తరువాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘అత్యంత తక్కువ సమయంలో పార్టీలో ఉన్నత స్థాయికి వెళ్లినవారే బయటకు వెళ్లారంటే పార్టీ తీరులో ఏదో లోపం ఉన్నట్లే’ అని సీడబ్ల్యూసీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ సన్నిహితులకు పార్టీలో కీలక పదవులు దక్కడాన్ని పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోయారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ సేనలో హరియాణా మాజీ పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్, మధ్యప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్, మహారాష్ట్రలో మిలింద్ దేవ్రా, సంజయ్ నిరుపమ్, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బాజ్వా, కర్ణాటకలో సీనియర్ నేత దినేశ్ గుండూరావు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారని, పదవి పోవడంతో పార్టీలో గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు తెలిపాయి. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే.. కొందరు రాహుల్‌కు విశ్వాసఘాతకులుగా మారారన్నాయి. -
సేవలందిస్తే ద్రోహం చేశారు
చిలకలగూడ: మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సికింద్రాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండ కార్తీకచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వమని చెబుతూనే సికింద్రాబాద్‌తో ఎటువంటి సంబంధం లేని నాయకుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా సేవలు చేసిన తనకు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఒత్తిడి మేరకు నామినేషన్ వేశానని, దానిని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు తలలు దించుకుంచే రీతిలో విజయం సా«ధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోంది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో...‘ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
మామపై రెబెల్‌గా పోటీ చేస్తా..!
సాక్షి, హైదరాబాద్: ‘నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు.. క్రిశాంక్ మాత్రమే. ఉస్మానియా విద్యార్థి నేతగా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితుడిని. 6 నెలలుగా నియోజకవర్గంలో బస్తీ నిద్రలు చేసి ప్రజలకు చేరువయ్యాను. మా జేబులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఎవరో వచ్చి టికెట్ ఎగరేసుకుపోతే ఎలా.. ఈ రోజు మా మామ.. రేపు ఇంకో పారాచూట్ నేత.. ఇంక మాకు ఓపిక లేదు. నేను రెబ ల్గా పోటీచేసేందుకే సిద్ధమవుతున్నా’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్ అన్నారు. ఓయూ విద్యార్థి నేత అయిన క్రిశాంక్‌కు గత ఎన్నికల్లో త్రుటిలో కంటోన్మెంట్ టికెట్ చేజా రింది. గత ఎన్నికల సందర్భంగా తన పేరును అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో మార్పు చేశారు. అయినా ఆయన అప్పటి నుంచి పార్టీలో కొనసాగు తూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రియాశీలకం గా పనిచేస్తున్నారు. తన మామ సర్వేకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై క్రిశాంక్ గళం విప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 3 సార్లు ఓడిపోయిన సర్వేకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ఎవరో ప్రజలకు తెలియదు.. సర్వే సత్యనారాయణ ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలియదని, తన పేరు అందరికీ తెలుసని క్రిశాంక్ చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఒక్క ఓయూ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ టికెట్ రావాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలని వ్యాఖ్యానించారు. -
ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కోటి వ్యూస్
ప్రస్తుతం నార్త్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్ స్టార్ల లిస్ట్‌లో అందరి కంటే ముందున్న హీరో ప్రభాస్. బాహుబలి సక్సెస్‌తో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో. బాహుబలి సినిమా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా భారీ వసూళ్లను సాధించటంతో ప్రభాస్ గత సినిమాలను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ప్రభాస్ కెరీర్లోనే భారీ ఫ్లాప్‌గా నిలిచిన రెబల్ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లో పెద్దగా సందడి చేయకపోయినా యూట్యూబ్‌లో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కోటిగా పైగా వ్యూస్ రావటంతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు బాహుబలి. గతంలో కేవలం రజనీకాంత్ హీరోగా నటించిన సినిమాలకు మాత్రం ఇలాంటి రికార్డ్‌లు సాధ్యమయ్యేవి. కానీ ప్రభాస్ జోరు చూస్తుంటే నార్త్‌లో రజనీ రికార్డ్‌ను బ్రేక్ చేసేలాగే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
బాహుబలిని కలవరపెడుతున్న వీరబలి
-
సినీ దర్శకుడు లారెన్స్‌పై చీటింగ్ కేసు
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ పై గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకరాం ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మాతలు. సినిమా ప్రారంభానికి ముందే లారెన్స్ నిర్మాతల మధ్య సినిమా ఖర్చు విషయంలో ఒప్పందం కుదిరింది. రూ.23 కోట్లతో సినిమాను పూర్తి చేస్తానని, అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించి నిర్మాతలు దర్శకుడికి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ సినిమాకు అనుకున్న దానికంటే రూ.5కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. ఇంత మొత్తాన్ని తాము భరించలేమని ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అదనంగా ఖర్చు చేసిన రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇచ్చేది లేదని లారెన్స్ మొండికేశారు. జవాబు కూడా చెప్పడం మానేశాడు. దీంతో బాధిత నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా... లారెన్స్ పైన, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మధ్యవర్తిగా ఉన్న అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్పైన కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు లారెన్స్ కోసం గాలింపు చేపట్టారు. -
అమీతుమీ
సాక్షి, ఏలూరు :టీడీపీని పెంచి పోషించి.. పార్టీ అధినేతను కడదాకా మోసి.. చివరకు బోయూలుగానే మిగిలిపోయిన వారంతా చంద్రబాబుపై కత్తులు దూస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథాలు చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీ శ్రేణులు సహకరించకపోవడంతో అభ్యర్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మనసులోని మాటను.. తమ ఆవేదనను ఇటీవల జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు విన్నవించుకునే ప్రయత్నం చేసినా ఆయన కనీసం పట్టించుకోకపోవడంతో పార్టీపై పలువురు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఐదు స్థానాల్లోటీడీపీ రెబెల్ అభ్యర్థులు బరిలోకి దిగారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి), తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగటంతో టీడీపీ అధినేతకు ముచ్చెమటలు పడుతున్నాయి. వీరంతా చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ నాయకులు భావించగా వారు ససేమిరా అన్నారు. దీంతో పార్టీ అభ్యర్థులకు వచ్చే కొద్దిపాటి ఓట్లు కూడా వీరివల్ల చీలిపోతాయని టీడీపీ వర్గాలు ఆందోళన చెం దుతున్నాయి. ‘నేను గెలుస్తా.. మీరు గెలవగలరా’ అం టూ రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీ మోహన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తనకు సీటు రాకుండా చేసిన మురళీమోహన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని రామారావు మాటలను బట్టి స్పష్టమైంది. మురళీమోహన్తోపాటు కొవ్వూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ జవహర్‌ను చిత్తుగా ఓడించటమే లక్ష్యంగా రామారావు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. పాలకొల్లు సీటును డాక్టర్ బాబ్జికే ఇస్తున్నట్లు ఊరించి.. చివరి క్షణంలో చంద్రబాబు ఆయనను మోసగించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారుు. మంచి వ్యక్తిగా పేరున్న బాబ్జిని పక్కనపెట్ట డాన్ని అక్కడి నాయకులు, కార్యకర్తలు అవమానంగా భావిస్తున్నారు. రామానాయుడిని ఓడించడమే లక్ష్యం గా పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించారు కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకుని తాడేపల్లిగూడెం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడంతో పైడికొండల మాణిక్యాలరావు బరిలోకి దిగారు. ఆయనపై కొట్టు సత్యనారాయణ పోటీకి దిగారు. చంద్రబాబు సూచనల మేరకే కొట్టు సత్యనారాయణ బరిలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అటు సొంత వారికి, ఇటు పొత్తు పెట్టుకున్న బీజేపీకి వెన్నుపోటు పొడిచే ఉద్దేశంతోనే తెరవెనుక చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నరసాపురం, పోలవరం స్థానాల్లో రెబల్స్ గుబులు రేపుతుండగా, భీమవరం, నరసాపురం, ఆచంట, ఉండి, దెందులూరు నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి సెగలు రగులుతున్నారుు. సమైక్యంగా ముందుకు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు సమైక్యతను చాటిచెప్పారు. పాలకొల్లులో గుణ్ణం నాగబాబు, ఆచంటలో కండిబోయిన శ్రీనివాస్, దెందులూరులో పీవీ రావు, నిడదవోలులో జక్కంశెట్టి రాకేష్ బుధవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో రెబెల్స్ లేని ఏకైక పార్టీగా వైఎస్సార్ సీపీ సమైక్యతను ప్రదర్శిస్తోంది. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారితో పాటు వైఎస్సార్ సీపీ నేతలంతా తమ పార్టీలో గ్రూఫు రాజకీయాలు లేవని ఘంటాపథంగా చెబుతున్నారు. విశ్వసనీయతకు పట్టంగట్టేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు. -
పొత్తు పొత్తే... పోటీ పోటీయే !
-
టీడీపీలో వణుకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ఒకవైపు రెబల్స్ గుబులు పుట్టిస్తుండగా.. మరొకవైపు టికెట్లు రాని నేతలు పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని వణికిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులతో టీడీపీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతోంది. మరో మూడు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లిసత్యనారాయణమూర్తి (బాబ్జి) తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన విషయం విదితమే. తాను ఎట్టి పరిస్థితుల్లోను నామినేషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై పోటీలోనే ఉండాలని నిర్ణయించారు. ఆయనను వెన్నంటి ఉన్న నాయకులు, శ్రేణులు అవసరమైతే చందాలు వేసుకుని మరీ బాబ్జిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో అక్కడి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సీటు వచ్చిందనే ఆనందం కంటే సీనియర్ నేత బాబ్జి రంగంలో ఉండటం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రామానాయుడు పరిస్థితి బాబ్జి తిరుగుబాటుతో మరింత దిగజారింది. రాష్ట్ర నేతలు మాట్లాడినా బాబ్జి పోటీనుంచి విరమించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. ఆయన కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి జవహర్‌కు కంటిమీద కునుకులేకుండా చేయడంతోపాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ ఓటమే తన ధ్యేయమని ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబును గౌరవిస్తానని చెబుతూనే పార్టీ అభ్యర్థులను ఓడిస్తానని స్పష్టం చేస్తున్నారు. చింతలపూడిలో ఆ పార్టీ నేత రాయల రాజారావు భార్య సుమలతను రెబల్‌గా పోటీ చేస్తూ టీడీపీని దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలే నాన్‌లోకల్ ఇబ్బందులతో సతమతమవుతూ ఏంచేయాలో తెలియక దిక్కులు చూస్తున్న ఆ పార్టీ అభ్యర్థి పీతల సుజాత రాజారావు తీరుతో మరింత బెంబేలెత్తుతున్నారు. తాడేపల్లిగూడెం సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వదిలేశారనే కోపంతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలి టీడీపీకి ఇరకాటంగా మారింది. పోటీనుంచి విరమిస్తానని కాసేపు, వెనకడుగు వేసేది లేదని కాసేపు ఆయన చెబుతుండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో వలస నేతలైన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), పితాని సత్యనారాయణకు టికెట్లు ఇవ్వడంతో ఇన్నాళ్లూ పార్టీని మోసినవారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. భీమవరంలో మెంటే పార్థసారథి వర్గానికి సర్ధిచెప్పడం ఎవరి తరమూ కావడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఎన్నివిధాలుగా సారథి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో మిన్నకుండిపోయారు. అంజిబాబుపై అన్ని వైపులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటివ్వడంతో ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత గుబ్బల తమ్మయ్య ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ నేతలు పితానికి సహకరించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో పితాని సొంత నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోనూ కీలక నేతలు పార్టీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి ఒక్కసారిగా తిరోగమనంలో పడినట్లయింది. -
బుజ్జగింపులు..బేరసారాలు
యలమంచిలి : యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ తిరుగుబావుటా అంతటా చర్చనీయాంశమవుతోంది. రెబల్‌గా అతని పోటీతో తమ పార్టీ ఓట్లకు గండి తప్పదన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆయనను బరిలోనుంచి తప్పించడానికి సామదాన దండోపాయాలకు అధిష్టానం సిద్ధమవుతోంది. యలమంచిలి టీడీపీ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్‌కుమార్‌కు మొండిచెయ్యి చూపడంతో రెబల్‌గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. స్థానికేతరుడైన పంచకర్ల రమేష్‌బాబుకు కేటాయించడాన్ని తెలుగు త మ్ముళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 38 మంది పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన విజయ్‌కుమార్‌ను కాదనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పంచకర్ల తనదైనశైలిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విశా ఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, స్థానిక ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు, మాజీ ఎంపి పప్పల చలపతిరావు తదితర ముఖ్యనాయకులను ప్రసన్నం చేసుకున్నారు. సుందరపు బరిలో ఉంటే తనకు ఏమేరకు నష్టం జరుగుతుందన్న విషయాలను ఆరాతీస్తున్నట్టు తెలి సింది. అతనికి ఏఏ గ్రామాల్లో బలం ఉందన్న విషయాలను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులే గడువు ఉండడంతో నష్టం అంచనాలో నాయకులు తలమునకలవుతున్నారు. విజయ్‌కుమార్‌ను ఏవిధంగా పోటీ నుంచి తప్పించాలన్న విషయమై ముఖ్యమైన నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. -
రెబల్ అభ్యర్థులపై టి కాంగ్ బహిష్కరణ
-
రెబల్స్‌పై ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్‌గా జిల్లా నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. పార్టీ నాయకత్వం నిర్ణయంతో ప్రమేయం లేకుండా సమైక్యాంధ్ర నినాదంతో చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలో దిగుతారని అంతా భావించారు. పలు దఫాలు సీమాంధ్ర నేతల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం చివరకు జిల్లా నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు, నెల్లూరు జిల్లా నుంచి ఆదాల మాత్రమే నిలిచారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌గా చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలోకి దిగాలనుకున్నారు. గడచిన రెండు రోజులుగా జరిగిన చర్చల పరంపర కొలిక్కి వచ్చి చైతన్యరాజు, ఆదాల నామినేషన్లు దాఖలు చేశారు. అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిళ్లు లేదా, సీమాంధ్ర నేతల మధ్య కుదిరిన అవగాహన కావొచ్చు జేసీ దివాకరరెడ్డి నామినేషన్ దాఖలు చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. మిగిలిన ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం రెబల్స్ ఇద్దరిని బరి నుంచి తప్పించేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు చేస్తోంది. చైతన్యరాజు, ఆదాల నామినేషన్లు దాఖలు చేసిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు ఒకరి తరువాత మరొకరు వెంటపడుతూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి పెంచుతున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం. ఈలోగా రెబల్స్‌ను బరి నుంచి తప్పుకునేలా ఒప్పించగలుగుతామనే ధీమాతో పార్టీ రాష్ట్ర నేతలున్నట్టుగా కన్పిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ పెద్దలు చైతన్యరాజుపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకురాగా, ఆరునూరైనా తాను రాజ్యసభ బరి నుంచి వెనక్కు తగ్గేది లేదని చెప్పారని హైదరాబాద్‌లో ఉన్న అనుచరుల ద్వారా తెలియవచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం చేసిన ఇద్దరు శాసనసభ్యులు పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వెనక్కు తగ్గినట్టు సమాచారం. ఆదాలకు మద్ధతు తెలియచేస్తూ ఇచ్చిన లేఖలను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కు తీసేసుకున్నారని తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం అనివార్యమేనంటున్నారు.గడచిన వారం రోజులుగా చర్చలు, సంప్రదింపుల నేపథ్యంలో చైతన్యరాజుకు మద్ధతుగా 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారితోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ఇస్తారనే ధీమా చైతన్యరాజు వర్గీయుల నుంచి వ్యక్తమవుతోంది. అధిష్టానం ఒత్తిళ్లు ఫలితాన్నిస్తాయో, బరి నుంచి తప్పుకునేది లేదని తెగేసి చెబుతోన్న చైతన్యరాజు మాట చెల్లుబాటు అవుతుందో చూడాలి. -
అన్యాయంగా రెబల్ ముద్ర వేశారు: గుత్తా జ్వాల