ఆ మ్యూజిక్ డైరెక్టర్.. సంగీతం కంపోజ్ చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు హీరోగానూ డిఫరెంట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. అలా ఓ వైపు స్టార్ హీరోల మూవీస్ కి పనిచేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. ఇప్పుడు 'రెబల్' అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన జీవీ.. 'రెబల్'తో యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!)
స్టూడియో గ్రీన్ పతాకంపై కే.జి.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూనే సంగీతం కూడా అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో సూర్య.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.
ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్.. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. టీజర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట ఓ ఫైట్ సీన్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాపై టీజర్ దెబ్బకు అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు.
(ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment