రజనీ సినిమాలో మళ్లీ ఐశ్వర్య! | aishwarya rai special charcter in rajani kanth kabali | Sakshi
Sakshi News home page

రజనీ సినిమాలో మళ్లీ ఐశ్వర్య!

Published Tue, Sep 22 2015 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

రజనీ సినిమాలో మళ్లీ ఐశ్వర్య!

రజనీ సినిమాలో మళ్లీ ఐశ్వర్య!

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ సినిమా కపాలి. చాలా ఏళ్లుగా స్టార్ డైరెక్టర్లతో తప్ప పనిచేయని రజనీకాంత్ రెండు ఫ్లాప్ సినిమాల తరువాత, కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న కొత్త దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాడు. బాషా సినిమా తరువాత రజనీ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాక ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకి జంటగా రాధికా ఆప్టే నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కూడా ఉండటంతో ఆ పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయాలని చాలా రోజులుగా ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. అయితే కథను మలుపుతిప్పే కీలకమైన పాత్ర కావటంతో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని, మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని ప్లాన్ చేశారు.

ఇటీవల జెజ్బా సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుండటంతో, తనతోనే ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ సభ్యులు అడిగితే ఐష్ కాదంటుందేమో అన్న ఆలోచనతో స్వయంగా రజనీతోనే ఐశ్వర్యకు ఫోన్ చేయించారని సమాచారం. రోబో సినిమాలో రజనీకి జోడిగా నటించిన ఈ బ్యూటీ మరోసారి సూపర్ స్టార్ తో తెరను పంచుకోడానికి ఓకే చెప్పేసిందని సమాచారం. త్వరలోనే రజనీ సినిమాలో ఐశ్వర్య చేయబోయే పాత్రపై అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement