50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్ | kochadaiyaan to be dubbed in kannada | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్

Published Wed, Jan 20 2016 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్

50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్

 రజనీకాంత్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్గా నిలిచిన 'కొచ్చడయాన్' అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. రజనీ కూమార్తె సౌంధర్య రజనీకాంత్ దర్శకత్వం చేసిన ఈ యానిమేషన్ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్తో పాటు తెలుగు, హిందీ, మరాఠి, భోజ్పురి, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా కన్నడంలో రిలీజ్కు రెడీ అవుతోంది.

దాదాపు 50 ఏళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండగా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో 50 ఏళ్ల తరువాత కన్నడంలో రిలీజ్ అవుతున్న తొలి డబ్బింగ్ సినిమాగా కొచ్చడయాన్ రికార్డ్ సృష్టించనుంది . యాబై ఏళ్ల క్రితం 1965లో తెలుగు సూపర్ హిట్ సినిమా మాయబజార్ కన్నడంలో అనువాదమైంది. ఆ తరువాత ఇన్నేళ్లకు కొచ్చడయాన్ డబ్ కావడంపై రజనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement