
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ‘రజనీ మక్కల్ మన్రం(ఆర్‌ఎంఎం)’ శ్రేణులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. రాజకీయ రంగప్రవేశానికి సహకరించే ఉద్దేశంతో రజినీకాంత్ ‘రజినీ మక్కల్ మన్రం(ఆర్‌ఎంఎం)’ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో గురువారం ఆర్‌ఎంఎం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కమల్‌తో కలిసి వెళ్తే లాభమా..నష్టమా? ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అని చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆ వివరాలను రజినీ మీడియాతో పంచుకున్నారు. ‘చాలా విషయాలు చర్చించుకున్నాం. వాళ్లంతా సంతృప్తి చెందారు. నాకే ఒక విషయంలో మోసపోయానన్న భావన ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తా’ అని రజినీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment