రజనీకి భార్యగా ఈశ్వరీరావు? | eshwarirao to be rajaji's heroine in kala | Sakshi
Sakshi News home page

రజనీకి భార్యగా ఈశ్వరీరావు?

Published Sat, Jun 10 2017 8:41 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

రజనీకి భార్యగా ఈశ్వరీరావు?

రజనీకి భార్యగా ఈశ్వరీరావు?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం కాలా. ఈ చిత్రం ఆరంభానికి ముందు నుంచే చాలా ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటి ప్రచారం అవుతూ చిత్ర హైప్‌ను పెంచేస్తున్నాయి. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్‌ మరోసారి డాన్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం కాలా. ఆయన అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకుడు.

కాగా ఇందులో రజకాంత్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమ ఖురేషి నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరో కీలక పాత్రలో అంజిలీపటేల్‌ నటిస్తున్నారు. కాగా ప్రముఖ హిందీ నటుడు నానాపటేకర్‌ రాజకీయనాయకుడిగా ప్రధాన పాత్ర పోషించనున్నారని, అదే విధంగా మరో బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ తివారి పోలీస్‌ అధికారిగా నెగిటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే నటుడు సముద్రకని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రజనీకాంత్‌ భార్యగా నటి ఈశ్వరీరావు నటించనున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.

ఈశ్వరిరావు 1990 ప్రాంతంలో కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో రాణించారన్నది గమనార్హం. దీంతో రజనీకాంత్‌ కాలాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ప్రేమలో విఫలమై నటి ఈశ్వరిరావును పెళ్లి చేసుకుంటారా? హ్యూమఖురేషీ రజనీకాంత్‌ ప్రేయసిగా నటిస్తున్నారా? అదీగాక రజనీ చిన్న వయసు పాత్రలో ధనుష్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు జంటగా హ్యూమఖరేషీ నటిస్తున్నారా? లాంటి పలు సందేహాలు కాలా చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి. వీటి గురించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ముంబైలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చి కాలా చిత్ర యూనిట్‌ ఈ నెల 24 నుంచి చెన్నైలో రెండో షెడ్యూల్‌ను మొదలెట్టడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement