ధనుష్
... అంటున్నారు హీరో ధనుష్. తన మావయ్య రజనీకాంత్ హీరోగా వండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థపై ధనుష్ ‘కాలా’ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించినంత వసూళ్లు రాబట్టలేదు. పైగా ‘కాలా’ తర్వాత మళ్లీ ఇదే బేనర్‌లో రజనీకాంత్‌తో సినిమా ఉంటుందనే వార్త వినిపించింది. అయితే రజనీతో మరో సినిమాని ధనుష్‌ని ప్రకటించకపోవడంతో వండర్ బార్ ఫిల్మ్స్‌ని మూసేశారని కోలీవుడ్ టాక్. ఈ వార్తలపై స్పందించిన ధనుష్ మాట్లాడుతూ–‘‘వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థ మూతపడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. రజనీ సార్‌తో నా తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించకపోవడం వల్ల ఇలాంటి వార్తలు వస్తున్నాయి. మంచి కథ కుదరగానే రజనీసార్‌ని సంప్రదించి, సినిమా చేస్తాం. ఏ సంస్థకైనా హిట్లు, ఫ్లాపులు మామూలే. అంతేకానీ, మా బ్యానర్‌ను మూసివేయలేదు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment