చంద్రముఖికి సీక్వెల్ తీస్తా | Sequel coming for Chandramuki | Sakshi
Sakshi News home page

చంద్రముఖికి సీక్వెల్ తీస్తా

Published Sat, Dec 14 2013 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

చంద్రముఖికి సీక్వెల్ తీస్తా

చంద్రముఖికి సీక్వెల్ తీస్తా

 చంద్రముఖి చిత్రం ఘన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చరిత్ర సృష్టించిన ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియలు సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు పి.వాసు, నిర్మాణ కర్తలు శివాజీ ఫిలింస్ అధినేతలు. ఈ చిత్రానికి కన్నడంలో సీక్వెల్ రూపొంది విజయం సాధించింది. దానికి పి.వాసునే దర్శకుడు. అలాంటిది తమిళంలో చంద్రముఖికి సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం రావడం లేదు. దర్శకుడు పి.వాసును ప్రశ్నిస్తే చంద్రముఖి చిత్ర సీక్వెల్ తెరకెక్కించడానికి తాను సిద్ధమన్నారు. రజనీకాంత్ నటిస్తేనే ఆ చిత్రం చేస్తానని పేర్కొన్నారు.

ఆయన రజనీతో ఉలైప్పాలి, మన్నన్, చంద్రముఖి, కుచేలన్ చిత్రాలను రూపొం దించారు. వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం రావాలన్న కోరిక చిత్ర పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని దర్శకుడు వాసు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ రజనీ సూపర్‌స్టార్ హోదాలో ఉన్నా అందరితోనూ కలిసిపోయే నటుడన్నారు. ఎంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న రజని అందరితోను సన్నిహితంగా మెలుగుతారన్నారు. రజనీ జీవిత చరిత్రను తెరకెక్కిస్తారా? అని అడుగుతున్నారని, అలాంటి డాక్యుమెంటరీ చిత్రాల కంటే పడయప్ప, బాషా వంటి చిత్రాలను రజనీతో రూపొందిస్తేనే అభిమానులు అందరూ ఆనందిస్తారని పి.వాసు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement