కబాలి లిస్ట్లో మరో రికార్డ్ | Kabali to be screened at the Le Grand Rex | Sakshi
Sakshi News home page

కబాలి లిస్ట్లో మరో రికార్డ్

Jun 26 2016 1:37 PM | Updated on Sep 4 2017 3:28 AM

కబాలి లిస్ట్లో మరో రికార్డ్

కబాలి లిస్ట్లో మరో రికార్డ్

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రికార్డ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో వేగం పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా...

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రికార్డ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో వేగం పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓవర్సీస్లో రజనీ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

ఈ నేపథ్యంలో పారిస్లోని ఓ ప్రస్టీజియస్ స్క్రీన్ మీద కబాలి సినిమా ప్రదర్శింపబడుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రదర్శింపబడిన ది లె గ్రాండ్ రెక్స్ హాల్లో కబాలి సినిమాను తొలి రోజే ప్రదర్శిస్తున్నారు. దాదాపు 2800 మంది ఒకేసారి చూసే ఏర్పాటు ఉన్న ఈ థియేటర్లో భారతీయ చిత్రాలు రిలీజ్ కావటం చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పుడు కబాలి సొంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement