'బాహుబలి' రికార్డు సేఫ్! | kabali can’t defeat Baahubali box office records | Sakshi
Sakshi News home page

'బాహుబలి' రికార్డు సేఫ్!

Published Mon, Aug 1 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

'బాహుబలి' రికార్డు సేఫ్!

'బాహుబలి' రికార్డు సేఫ్!

చెన్నై: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్ 'కబాలి' మొదటి వారం తర్వాత నెమ్మదించింది. అయితే ఫస్ట్ వీక్ లో మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ట్రేకర్ బి. రమేశ్ వెల్లడించారు. 'కబాలి' సినిమా ఇండియా రూ.149 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ.172 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా మొదటి వారంలో రూ. 262 కోట్లు కొల్లగొట్టిందని ట్విట్టర్ ద్వారా రమేశ్ తెలిపారు.

'బాహుబలి' రికార్డును తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి' నిర్మాత కళైపులి ఎస్. థాను అంతకుముందు ప్రకటించారు. అయితే కలెక్షన్లు తగ్గిపోవడంతో  'బాహుబలి' రికార్డును 'కబాలి' చేరుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన మొదటి నుంచే భారీ వసూళ్లు రాబట్టిన 'బాహుబలి' రూ.500 కోట్ల మైలురాయిని అందుకుంది. 'కబాలి' కలెక్షన్లు రూ.500 కోట్లు దాటటకపోవచ్చని విశ్లేషకులు అంచనా. నార్త్ ఇండియాలోనూ 'బాహుబలి' తర్వాతే కబాలి నిలిచిందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫాక్స్ స్టార్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement