కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి | Baahubali beat Kabali Record | Sakshi
Sakshi News home page

కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి

Published Fri, Jul 29 2016 10:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి

కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి

సౌత్ సినిమా రేంజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకు మాత్రమే సాధ్యం అనుకున్న వందల కోట్ల కలెక్షన్లను ఇప్పుడు సౌత్ సినిమాలు కూడా అవలీలగా సాధించేస్తున్నాయి. టాప్ స్టార్ల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్లోనే వంద కోట్ల కలెక్షన్లకు చేరువవుతున్నాయి. ఇక ప్రపంచ సినీ అభిమానులను సైతం తన వైపు తిప్పుకున్న కబాలి సౌత్ సినిమా రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది.

అయితే ఇంతటి భారీ కలెక్షన్లు సాధించిన కబాలి రికార్డ్లు అప్పుడే బ్రేక్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి 2 రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిన బాహుబలి యూనిట్, తొలి అడుగులోనే కబాలి రికార్డ్ను బద్దలు కొట్టి సత్తా చాటింది. కబాలి సినిమా మళయాల రైట్స్ను హీరో మోహన్ లాల్ 7.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ బాహుబలి 2 మళయాల రేట్స్ 10.5 కోట్లకు అమ్ముడయ్యాయి.

మాలీవుడ్లో ప్రముఖ డిస్ట్రీబ్యూషన్ కంపెనీగా పేరున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి బాహుబలి రైట్స్ సొంతం చేసుకుంది. బాహుబలి తొలి భాగం రైట్స్ను కూడా ఇదే కంపెనీ సొంతం చేసుకోవటం విశేషం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న బాహుబలి 2 సినిమాను 2017 ఏప్రిల్ 14 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement