రజనీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'రోబో' సీక్వల్కు రంగం సిద్దమైంది. సౌత్ సినిమా చరిత్రలోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ విజువల్ వండర్కు సీక్వల్ను ఈ ఏడాది చివరలో ప్రారంభించనున్నారు. 'ఐ' ఫెయిల్యూర్తో కష్టాల్లో ఉన్న శంకర్, వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న రజనీ... ఇద్దరికీ ఈ సినిమా కీలకం కానుంది. అందుకే చాలా రోజులుగా స్క్రీప్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు శంకర్.
ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన 'పాపనాశం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కథ అందించిన జియామోహన్ 'రోబో' సీక్వల్కు కథ అందిస్తున్నాడు. స్క్రీప్ట్ పూర్తవ్వగానే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించటానికి ప్లాన్ చేసుకుంటున్నారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని కథ రచయిత జియామోహన్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం రజనీకాంత్, రంజిత్ దర్శకత్వంలో 'కబాలీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే 'రోబో' సీక్వల్ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్.
'రోబో' సీక్వల్పై వస్తున్న వార్తల పై కూడా స్పందించాడు కథారచయిత జియామోహన్. ఈ సినిమాలో అమీర్ ఖాన్, కమల్హాసన్, విక్రమ్లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించాడు. రజనీకాంత్ తప్ప మరే ఆర్టిస్ట్ను ఫైనల్ చేయలేదని, స్క్రీప్ట్ పూర్తయిన తరువాతే నటీనటుల ఎంపిక మొదలు పెడతామన్నారు.
రోబో 2కు రంగం సిద్ధం
Published Fri, Sep 4 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement