
విమానాలకు కబాలి పోస్టర్స్
రజనీ కాంత్.. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తున్నాడు. ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్, తాజాగా మరో రికార్డ్కు రెడీ అవుతున్నాడు. రెండు భారీ ఫ్లాప్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగా ప్రచారం విషయంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా విమానాలకే కబాలి పోస్టర్స్ వేస్తున్నారట. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది.