కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్ | Legendary actor mohan lal bags Kabali Kerala rights | Sakshi
Sakshi News home page

కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్

Published Thu, Jun 30 2016 3:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్

కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్తో పాటు యూట్యూబ్ సెన్సేషన్గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.

తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న కబాలి సినిమాపై మాలివుడ్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా కేరళ రైట్స్ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ రైట్స్ తీసుకోవటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కబాలి యూనిట్.

రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. మలేషియాలో స్థిర పడిన శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ వయసు మళ్లిన డాన్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి జూలై రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement