
తారలు.. పారితోషికాలు
సినిమా అన్ని రంగాల మాదిరిగానే వ్యాపార రంగమే. అయితే ఇతర రంగాల్లా పెట్టుబడికి పెద్దగా గ్యారెంటీ లేని రంగం. ఇక్కడ నిర్మాతలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. కొడితే లక్కు, లేకుంటే కిక్కు కూడా ఉండదు. అయితే చిత్రాల్లో నటించే తారలకు మాత్రం లక్కుంటే యమ కిక్కే. వారికి మొదట ఒక్క అవకాశం, ఆ తరువాత ఒకే ఒక్క విజయం అంతే చాలు. ఆ సక్సెస్ చూపిస్తూ మొదట పెంచుకునేది పారితోషికాలే. అలా తారల పారితోషికాలు ఇవాళ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో.
ప్రస్తుతం టాప్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారల పారితోషికాలెంతన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుడికి ఉంటుంది. తారల పారితోషికాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి హక్కులకు గాను వారికి చేతికందుతు న్న మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి కొందరు టాప్ తారల పారితోషికాల వివరాలివి. ముందుగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌తోనే మొదలెడదాం.
2.ఓ చిత్రాన్ని పూర్తి చేసి కాలా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న రజనీ తాజా పారితోషికం రూ.60కోట్లు, విజయ్, అజిత్‌లు రూ.48కోట్ల నుంచి రూ.50కోట్లు, సూర్య రూ.38కో ట్లు, విక్రమ్ రూ.20 కోట్లు, ధనుష్ రూ.15 కోట్లు, శివకార్తికేయన్ రూ.15కోట్లు, జయంరవి రూ.10 కోట్లు, శింబు రూ.10 కోట్లు, సంతానం రూ.8కోట్లు, విజయ్‌సేతుపతి రూ.6కోట్లు, ఇక తారల్లో అగ్ర స్థానం అనుష్కదేనట.
ఈ స్వీటీ రూ.5 కోట్లు, నయనతార రూ.4కోట్లు, శ్రుతీహాసన్ రూ.2కోట్లు, కాజల్‌అగర్వాల్, సమంతలు రూ.రెండు కోట్లు, త్రిష రూ.ఒక కోటి పారితోషికాలు పుచ్చుకుంటున్నారట. అయితే ఈ సంఖ్య అధికారికంగా ప్రకటించినది కాదు. కోలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న బేస్‌లెస్ లెక్కలే అన్నది గమనార్హం. అయితే పైన చెప్పిన తారలు ఇంచు మించు అంత పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారన్నది వాస్తవమే. ఇక ఈ విషయంలో వారి వెర్షన్ వేరేలా ఉంటుందని వేరే చెప్పాలా!