
సాక్షి, చెన్నై: తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయనతార భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. కోలీవుడ్‌లో తలైవాగా చాలా మంది ఎదిగారు. అలా ప్రస్తుతం తలైవాగా అభిమానులు తలకెక్కించుకుంటున్న హీరో రజనీకాంత్. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఆశతో నిరీక్షిస్తున్నారు. అయితే అనూహ్యంగా విశ్వనటుడు దూసుకొచ్చారు. రజనీకాంత్ కూడా తన పుట్టిన రోజు(డిసెంబర్12)న తన రాజకీయ రంగప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచార విషయాలు జగమెరిగిన సత్యమే.
లెడీ సూపర్‌స్టార్‌గా నయన..
ప్రస్తుతం కొత్తగా తలైవి పేరు వేలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు లెడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతినే. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత నటనకు దూరం ఉండడంతో మరొకరి కోసం ఆ బిరుదు ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్ నయనతార అభిమానులతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా నటించిన అరమ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది.
అభిమానులు తలైవిగా పిలుస్తున్నారు..
ఈ చిత్రంలో కలెక్టర్‌గా నయనతార పాత్ర పోషణ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సంతోషంలో థియేటర్లను విజిట్ చేస్తున్న నయనతారను అభిమానులు తలైవి అంటూ పేర్కొనడం విశేషం. తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయన భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న సామెత గుర్తుకొస్తోంది కదూ. కాగా అరమ్ సక్సెస్ బాటలో పయనించడంతో ఆ చిత్ర నిర్మాత అరమ్‌కు సీక్వెల్ నిర్మిస్తానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment