విజయాల బాట పట్టిన హీరోయిన్‌..! | Heroien Nayanatara acts in the Aram Movie | Sakshi
Sakshi News home page

విజయాల బాట పట్టిన హీరోయిన్‌..!

Published Thu, Sep 14 2017 8:53 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

విజయాల బాట పట్టిన హీరోయిన్‌..!

విజయాల బాట పట్టిన హీరోయిన్‌..!

నయనతార మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా  ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్‌ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచన నటి మాయ చిత్రంతో కథను తన భూజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు. ఆ తరువాత నటించిన డోరా నిరాశ పరచినా నయనకు దాని ఎఫెక్ట్‌ ఏ మాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే అధిగమించారో, హీరోయిన్గా అపజయాలను దాటి విజయాల బాట పట్టారు.

ప్రస్తుతం అరమ్‌, కొలైయుధీర్‌ కాలం, ఇమైకా నోడిగళ్‌, నేర్‌వళి వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతేకాక మరోపక్క హీరోలతో కమర్షియల్‌ చిత్రాలను  నటిస్తున్నారు. శివకార్తకేయన్‌తో  జత కట్టిన వేలైక్కారన్‌ చిత్రం డుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్‌, ఆరమ్‌ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

కుట్రం 23 వంటి క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్‌ దర్శకత్వంలో నయనతార నటించనుందని తాజా సమాచారం. ఇందులో సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement