
చెన్నె : నయనతార నటించిన చిత్ర సీక్వెల్ లో కీర్తి సురేష్ నటించనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2017 నయనతార నటించిన చిత్రం అరం. దర్శకుడు గోపి నయినార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో నయనతార కలెక్టర్ గా నటించారు. బోర్‌వెల్‌లో పడిపోయిన పిల్లాడిని రక్షించే కథతో వచ్చిన ఆ చిత్రం ఆమెకు ఓరియెంటెడ్ చిత్రాల నాయికగా క్రేజీ మరింత పెంచింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు అప్పుడే ప్రకటించారు. ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార అరం 2లో నటించడానికి సిద్ధపడలేదని సమాచారం.(మహేశ్‌తో ఢీ?)
దీంతో దర్శకుడు గోపీ నయినార్ ఆ తర్వాత నటి సమంతను అరం 2లో నటింప చేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు కీర్తి సురేష్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నయనతారతో కీర్తి సురేష్‌ను పోల్చుతూ ఆమె నయనతార లాగా నటించలేదని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా కీర్తి సురేష్ మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. అలాంటి విమర్శలను ఛాలెంజ్ గా తీసుకొని సావిత్రి పాత్రకు జీవం పోసింది. అంతేకాదు మహానటి చిత్రంలోని కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. కాగా ఇప్పుడు అరం 2 చిత్రంలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరిస్తే కచ్చితంగా ఆ చిత్రానికి ప్రాణం పోస్తుందని ఒక వర్గం పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment