
బస్ కండక్టర్ నుంచి ఇండియన్ సూపర్‌స్టార్‌గా రజనీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. పక్కా కమర్షియల్ కథలాంటి జర్నీ. ఇప్పుడు ఈయన ప్రయాణం ఓ సినిమా కాబోతోందని కోలీవుడ్ టాక్. రజనీ జీవిత కథను బయోపిక్‌గా తీసుకురావాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేస్తున్నారట. లింగుస్వామి తమిళంలో తెరకెక్కించిన ‘సండై కోళి’, ‘పయ్యా’ (తెలుగులో ‘పందెం కోడి, ఆవారా’) వంటి సినిమాలు తెలుగులోనూ బాగా ఆడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంలో ‘రజనీ బయోపిక్ చేయాలనుంది. రజనీ పాత్రలో ధనుష్ యాక్ట్ చేస్తే బావుంటుంది’ అని పేర్కొన్నారు లింగుస్వామి. రెండేళ్లుగా లింగుస్వామి కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. తలైవా (నాయకుడా అని అర్థం. రజనీని చాలామంది అలానే పిలుస్తారు) రజనీ బయోపిక్‌కి సంబంధించిన కథ మీదే వర్క్ జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment