
ఐశ్వర్యకు కూడా తప్పలేదు
ఒక్కోసారి టాప్ సినిమా సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టం లేని పనిచేయాల్సి వస్తుంది. సినిమా ప్రమోషన్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్య రాయ్కు కూడా ప్రస్తుతం...
ఒక్కోసారి టాప్ సినిమా సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టం లేని పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్యా రాయ్కు కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొటుంది. గతంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ మీద కామెంట్స్ చేసిన ఐశ్వర్య, తన రీఎంట్రీ సినిమా జెబ్జా కోసం సోషల్ మీడియాలో అడుగుపెడుతుంది.
ఇంటర్ నేషనల్ లెవల్లో టాప్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలందరూ ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. చాలాకాలంగా ఇలాంటి ప్రమోషన్లకు దూరంగా ఉన్న రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇటీవలే ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేసి అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. ఇదే బాటలో నడవడానికి రెడీ అవుతుంది అతిలోక సుందరి ఐశ్వర్యరాయ్.
తన ట్విట్టర్ ఎంట్రీ కోసం ముహుర్తం కూడా ఫిక్స్ చేసేసింది. రీఎంట్రీ సినిమా జెబ్జా రిలీజ్కు ఒక్క రోజు ముందు అక్టోబర్ 8న తన ట్విట్టర్ ఖాతను తెరవనుంది ఐశ్వర్య. ఇప్పటికే ట్విట్టర్ ఫాలోవర్స్ లిస్ట్తో కూడా రికార్డ్ సృష్టిస్తున్న మన బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్య ఎంట్రీతో వెనకపడిపోతారేమో చూడాలి.