కబాలి రిలీజ్ మరోసారి వాయిదా..? | Kabalis release date postponed | Sakshi
Sakshi News home page

కబాలి రిలీజ్ మరోసారి వాయిదా..?

Jun 8 2016 1:43 PM | Updated on Sep 4 2017 2:00 AM

కబాలి రిలీజ్ మరోసారి వాయిదా..?

కబాలి రిలీజ్ మరోసారి వాయిదా..?

రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కబాలి. ఈ సినిమాకు సంబందించి రోజుకో వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఆన్లైన్లో, ప్రీ రిలీజ్ బిజినెస్లో సంచలనాలు నమోదు...

రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కబాలి. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఆన్లైన్లో, ప్రీ రిలీజ్ బిజినెస్లో సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్తలు మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

ఇప్పటికే భారీగా జరుగుతుందనుకున్న ఆడియో ఫంక్షన్ లేదన్న వార్త అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ షాక్ నుంచి కోలుకోకముందే సినిమా రిలీజ్ విషయంలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కబాలి రిలీజ్కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అందులో భాగంగా పలు ముస్లిం దేశాల్లో కూడా ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుండటంతో అదే సమయంలో కబాలిని రిలీజ్ చేయటం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోందట. ఈ సమయంలో ముస్లింలు సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించరు కాబట్టి, రంజాన్ మాసం పూర్తయిన తరువాత కబాలిని రిలీజ్ చేయాలన్న ఆలోచన చేస్తున్నారట. ఇప్పటి వరకు సినిమా వాయిదాపై యూనిట్ సభ్యులు ప్రకటన చేయకపోయినా.. తమిళనాట కబాలి రిలీజ్పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement