Joker 2 : ‘జోకర్‌’ మళ్లీ వచ్చేస్తున్నాడు! | Musical Psychological Thriller Joker 2 Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Joker 2 Movie Release Date: ‘జోకర్‌’ మళ్లీ వచ్చేస్తున్నాడు!

Published Sat, Feb 17 2024 10:33 AM | Last Updated on Sat, Feb 17 2024 11:04 AM

Joker 2 Movie Release Date Out - Sakshi

హాలీవుడ్‌ జోకర్‌ మళ్లీ వస్తున్నాడు. హాలీవుడ్‌ మ్యూజికల్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘జోకర్‌’. జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో టాడ్‌ ఫిలిప్స్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జోకర్‌ 2’ (జోకర్‌: ఫోలీ ఎ డ్యూక్స్‌)ను ప్రకటించారు టాడ్‌ ఫిలిప్స్‌. ఈ చిత్రంలో జోక్విన్‌ ఫీనిక్స్‌తో పాటు లేడీ గగా మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.

జాజై బీట్జ్‌ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. లాస్‌ ఏంజిల్స్, న్యూయార్క్, న్యూ జెర్సీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఏప్రిల్‌ 4న విడుదల కానుం దని హాలీవుడ్‌ టాక్‌. సినిమాను ఈ ఏడాది అక్టోబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. టాడ్‌ ఫిలిప్స్, బ్రాడ్లీ కూపర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్నర్‌ బ్రదర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement