Joker 2: జోకర్‌ 2లో  15 కవర్‌ సాంగ్స్‌? | Joker 2 Is A Musical Thriller With 15 Cover Songs And Original Tracks, Deets Inside - Sakshi
Sakshi News home page

Joker 2 Musical Details: జోకర్‌ 2లో  15 కవర్‌ సాంగ్స్‌?

Published Sun, Mar 24 2024 9:03 AM | Last Updated on Sun, Mar 24 2024 1:06 PM

Joker 2 Is A Musical Thriller With 15 Cover Songs - Sakshi

హాలీవుడ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జోకర్‌’ 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జోక్విన్‌ ఫీనిక్స్‌ లీడ్‌ రోల్‌ చేసిన ఈ సినిమాకు టాడ్‌ ఫిలిప్స్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జోక్విన్, ఫిలిప్స్‌ కాంబినేషన్‌లోనే ‘జోకర్‌: ఫోలీ ఏ డ్యూక్స్‌’ (జోకర్‌ 2) చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆర్ధర్‌ ప్లెక్‌ అలియాస్‌ జోకర్‌ పాత్రలో జోక్విన్, హార్లే క్విన్‌గా లేడీ గగా కనిపిస్తారు.

ఈ ఏడాది అక్టోబరులో ‘జోకర్‌ 2’ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో దాదాపు 15 కవర్‌ సాంగ్స్‌ (రీమిక్స్‌ తరహాలో) ఉంటాయని హాలీవుడ్‌ సమాచారం. ‘ది బ్యాండ్‌ వాగన్‌’ (1953) సినిమా నుంచి ‘దట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పాట, ‘మమ్మా మియా’ (2008) చిత్రంలోని ఓ పాట.. ఇలా పలు పాటలు ‘జోకర్‌ 2’లో కవర్‌ సాంగ్స్‌గా వినిపిస్తాయట. అంతే కాదు.. ఈ కవర్‌ సాంగ్స్‌లో కొన్నింటిని జోక్విన్, లేడీ గగా పాడనున్నారని హాలీవుడ్‌ టాక్‌. ‘జోకర్‌ 2’ సినిమాకు ఐజీ హిల్దుర్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement