ఆ అవార్డు తీసుకున్నందుకు అవమానంగా ఉంది | Amid Huge Jallikattu Movement, Dhanush Says He Regrets PETA Award | Sakshi
Sakshi News home page

ఆ అవార్డు తీసుకున్నందుకు అవమానంగా ఉంది

Published Fri, Jan 20 2017 1:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

ఆ అవార్డు తీసుకున్నందుకు అవమానంగా ఉంది

ఆ అవార్డు తీసుకున్నందుకు అవమానంగా ఉంది

చెన్నై: మూగజీవుల సంరక్షణ సంస్థ పెటాపై తమిళ హీరో ధనుష్‌ విమర్శలు చేశాడు. పెటాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్నేళ్ల క్రితం ఆ సంస్థ నుంచి అవార్డు తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నానని చెప్పాడు. తాను శాకాహారి అయినందుకు కొన్నేళ్ల క్రితం పెటా తనకు అవార్డు ప్రదానం చేసిందని, దీన్ని తీసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నానని అన్నాడు. 2012లో పెటా హాటెస్ట్‌ వెజిటేరియన్ అవార్డుతో ధనుష్ను సత్కరించింది.

పెటా వల్ల సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించడం, తమిళనాడులో జల్లికట్టు మద్దతుదారులు తీవ్ర ఆందోళన చేపట్టడం, పెటాపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ధనుష్‌ స్పందించాడు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ పెటాతో ఎలాంటి సంబంధాల్లేవని చెప్పాడు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement