
కోవిడ్ పాజిటివ్ రోగులకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందజేయనున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. సీఆర్ పాటిల్ సూరత్ సీవిల్ ఆసుపత్రిని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆసుపత్రిలో 5000 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇది వ్యాధి సంక్రమణ చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఔషధం కొరత ఏర్పడిందని పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని వెంటనేఈ ఏర్పాట్లు చేసినట్లు పాటిల్ తెలిపారు.
ఔషధం అవసరమైన రోగులు పార్టీని ఉచితంగా పొందటానికి సంప్రదించవచ్చుఅని పాటిల్ తెలిపారు. వడోదరలోని బీజేపీ ఆసుపత్రులలోని కోవిడ్ పాజిటివ్ రోగులకు ఉచిత ఆహార ప్యాకెట్లను కూడా సరఫరా చేస్తోందని చెప్పారు. మూడు లక్షల యాంటీ వైరల్ ఔషధం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు పెట్టినట్లు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. గుజరాత్‌కు అదనంగా 24,687 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు లభించగా మొత్తం ఏప్రిల్ నెలలో 1,70,738 ఇంజెక్షన్లు అందుకున్నారు. గుజరాత్ ఫుడ్ & డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ హేమంత్ కోషియా దేశంలో ఔషధ తయారీదారులు ఆరుగురు మాత్రమే ఉన్నారని వారు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తారు అని పేర్కొన్నారు..
Comments
Please login to add a commentAdd a comment