
గాంధీనగర్: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు బోలెడు ఉన్నాయి. కానీ ఓ మహిళ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు సుమారు ఆరు నెలలు మహమ్మారితో పోరాడి విజయం సాధించింది. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దాహోద్ పట్టణానికి చెందిన ఒక రైల్వే ఉద్యోగి భార్య అయిన గీతా ధార్మిక్.. ఒక కార్యక్రమం నిమిత్తం భోపాల్‌కు వెళ్లగా కరోనా సోకింది.
దాహోద్ రైల్వే దవాఖాన, వడోదరలోని ఒక ప్రైవేటు దవాఖానలో ఆక్సిజన్ సపోర్టుతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.. అయితే అందరిలానే రెండు వారాలో, లేదా నెలలోపు తిరిగి ఆరోగ్యం ఇంటికి వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమెకు కరోనా సోకిన తరువాత తొమ్మిదిసార్లు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే ఆమె ఊపిరితిత్తుల కూడా మార్పిడి చేయాలన్నారు. అలా వైరస్‌తో ఏకంగా 202 రోజులు పోరాడి చివరికి కోలుకొని ఇంటికి చేరింది. ఆ మహిళ ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
చదవండి: సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదేమో!.. చనిపోయి మళ్లీ బతికాడు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment