ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించాలని అధికారులు ప్రచారం చేసినా ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆఖరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నా ముందుకు రావడం లేదు కూడా. ఎందుకుంటే? అక్కడ జరిగిన పలు ఘటనలే. పోతే పోయాయి డబ్బులు అని కార్పోరేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలు జంకడానికి ఇవేనేమో అనిపించేలా ఇక్కడ ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన నిండు గర్భిణి ఆస్పత్రి వెలుపలే గజగజలాడే చలిలో ఓ కూరగాయాల బండిపైనే ప్రసవించింది. ఆరుబయటే బహిరంగంగా ఓ తల్లి నొప్పులు పడి కనే దుస్థితి ఎదురైంది. ఈ ఘటనతో మాకు ఆస్పత్రులు, అక్కడ సిబ్బందిపై నమ్మకం పోయిందంటూ ఆ మహిళ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. అదీకూడా ఆస్పత్రి ప్రాంగణలోనే ఈ దారుణం జరగడం మరింత బాధకరం!
అసలేం జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన హర్యానాలో అంబాలాలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మెహాలి జిల్లాలోని దప్పర్ నివాసి తన భార్య గర్భవతి అని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు నొప్పులు మొదలవ్వడంతో స్ట్రెచర్ కోసం కంగారుగా ఆస్పత్రిలోకి పరుగెట్టాడు ఆ వ్యక్తి. అయితే అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ స్ట్రెచర్ తెచ్చేందుకు రాలేదు. పైగా అక్కడ ఉన్నవారెవరూ ఆమెను జాయిన్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆమెను లోపలికి తీసుకువెళ్లేలోపే ఆస్పత్రి గేటు సమపంలో బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. ఆ తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారు.
తాను ఎంతలా ఆ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదనగా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తల్లి బిడ్డలను దేవుడే కాపాడాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తనకు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై నమ్మకంపోయిందని వేదనగా చెప్పాడు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా సదరు ఆస్పత్రిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆ తల్లి బిడ్డలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి వార్డులో ఉంచారు. ఈ ఘటన గురించి పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు చేరడంతో తక్షణమే ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఏ రాష్ట్రం అయినా అభివృద్ధిపథంలోకి వెళ్తుండటం అంటే సామాన్యుడికి సైతం సక్రమమైన వైద్యం, బతకగలిగే కనీస సౌకర్యాలు ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఘటనలు పునురావృతమవుతున్నంత కాలం అధికారులపై, నమ్మకంపోతుంది. పైగా అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుంగా పోతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సామాన్యుడికి అన్నిరకాల వసతులు అందేలా చేసి ప్రజలచేతే తమ రాష్ట్రం అభివృద్ధిపథంలోకి పోతుందని సగర్వంగా చెప్పేలా చేయండి. అప్పడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది.
(చదవండి: చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలనుకుంది! అందుకోసం ఆమె ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment